టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళికి పాన్ ఇండియా లెవెల్లో ఎలాంటి ఇమేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన సినిమాల్లో నటిస్తే బాగుండని ఎంతోమంది స్టార్ హీరోలు కూడా తెగ ఆరాటపడుతున్నారు. రాజమౌళి సినిమాలో ఛాన్స్ వస్తే అసలు మిస్ చేసుకోకూడదని తెగ ఆరాటపడుతున్నారు. అలాంటి రాజమౌళినే డైరెక్ట్‌గా సినిమాలో ఆఫర్ ఇచ్చిన ఓ హీరోయిన్ రిజెక్ట్ చేసిందంటూ న్యూస్ నెటింట వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ సినిమా ఏదో కాదు.. బాహుబలి. ఈమూవీ దేవసేన పాత్రలో అనుష్క నటించిన సంగతి తెలిసిందే. అనుష్క కంటే ముందు జక్కన్న మరో కత్తిలాంటి ఫిగర్‌ను సినిమాలో నటింపజేయాలని భావించారట. ఇక టైం బ్యాడ్ అయినప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తారు.. అంత మంచి జాక్ పాట్ ఆఫర్ తలుపుతట్టిన అమ్మడు రిజెక్ట్ చేసిందట.
అది కూడా రెమ్యునరేషన్ తక్కువ అనే ఉద్దేశంతో సినిమాను రిజెక్ట్ చేసిందట. ఇంతకంటే బ్యాడ్ లక్ మరొకటి ఉండదన్నడంలో అతిశయోక్తి లేదు. ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు.. సౌత్ నెంబర్ వన్ హీరోయిన్ గా స్టార్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న నయనతార. జక్కన్న డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన బాహుబలి రెండు సీరియస్ లు ఎలాంటి సక్సెస్ అందుకున్నాయో.. తెలుగు సినీ ఖ్యాతిని ఎంతలా పెంచాయో అందరికీ తెలిసిందే. అప్పట్లో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా అనుష్క, తమన్నా ఆకట్టుకున్నారు. తమన్న మెయిన్ హీరోయిన్ కాదు. ఒక రొమాంటిక్ సాంగ్ తప్ప తమన్నా పెద్దగా స్క్రీన్ పై కనిపించింది లేదు.
ఇక మెయిన్ లీడ్ అనుష్క పాత్ర కోసం మొదటి నయనతారను అప్రోచ్ కాగా.. నయన్‌కు కథ నచ్చిందట. అయితే రమ్యునరేషన్ విషయంలో తేడాలు రావడంతో ఆ సినిమాను రిజెక్ట్ చేసిందని.. అంతేకాదు రమ్యకృష్ణ నటించిన శివగామి పాత్ర కోసం మొదటి శ్రీదేవిని భావించిన.. ఈమెను కూడా రెమ్యూనరేషన్ ఎక్కువనే ఉద్దేశంతో సినిమాలో తీసుకోలేదని టాక్. ఎలాగో పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ సినిమాలో నటించే జాక్‌పాట్ ఆఫర్‌ను నయన్, శ్రీదేవి ఇద్దరు మిస్ చేసుకున్నారు. ఇక సినిమాలో వీరిద్దరూ నటించి ఉంటే ఈ రేంజ్‌లో సక్సెస్ అందుకునేదో లేదో తెలియదు. కానీ.. అనుష్క, రమ్యకృష్ణ వారి పాత్రల్లో మరింతగా ఆకట్టుకునే సినిమాను మరో లెవల్లో సక్సెస్ అందుకునేలా చేశారు. ఇక ఈ సినిమాలో దేవసేన పాత్రలో అనుష్కను తప్ప మరే హీరోయిన్ ఊహించుకోలేనంతగా ఆమె లీనమై నటించింది.