టాలీవుడ్ నటదిగ్గజం ఏఎన్ఆర్‌కు తెలుగు ప్రేక్షకుల్లో ఎలాంటి పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటుడిగా ఇండస్ట్రీలో ఎంత ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఆయనకు నట వారసుడిగా నాగార్జున ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. అలా హీరోగా మారిన అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ కింగ్‌గా క్రేజ్ పొందాడు నాగార్జున. తాను నటించిన ఎన్నో సినిమాలతో సూపర్ హిట్లు అందుకున్న నాగ్ ఇప్పటికీ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ తన ఫిట్‌నెస్‌తో ఆకట్టుకుంటున్నాడు.
ఇక ప్రస్తుతం ఓవైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు బిగ్ బాస్ హోస్ట్‌గా బిజీ లైఫ్‌ను లీడ్ చేస్తున్న నాగ్.. బాల్యం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు నెటింట వార్తలు వైరల్‌గా మారుతున్నాయి. తన చిన్న వయసులో ఎన్నో చిలిపి చేష్టలు చేసేవాడని.. అందరితో తన్నులు తినేవాడినంటూ ఓ ఇంటర్వ్యూలో నాగార్జున స్వయంగా షేర్ చేసుకున్నాడు. తన స్కూలింగ్ అంతా చెన్నైలో జరిగిందని చెప్పుకొచ్చిన నాగార్జున.. అందరిలోనూ తానే చిన్నవాడని. చిన్నప్పుడు ఎంతో అల్లరి చేస్తూ ఉండే వాడినట్టు వెల్లడించాడు.
ఇక తండ్రి ఇంట్లో ఉన్నంతసేపు రాముడు మంచి బాలుడు అన్నట్టు ఎంతో సైలెంట్ గా ఉండేవాడట. ఆయన పక్కకు వెళ్లిన వెంటనే తన విశ్వరూపాన్ని చూపించేవాడట. ఇంట్లో ఉన్న అన్న వెంకటేష్, అలాగే అక్క సుశీలతో తన పనులన్నీ చేయించుకునే వాడినని.. వాళ్ళని తెగ కొట్టేసే వాడినంటూ చెప్పుకొచ్చాడు. ఒకవేళ పనులు చేయకపోతే వాళ్లను కొట్టి.. తిరిగి ఏఎన్ఆర్ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్లపైన కంప్లైంట్ ఇచ్చేవాడట. ఈ విషయాలు యాంకర్ ప్రదీప్ తో గతంలో కొంచెం టచ్ లో ఉంటే చెప్తా షోలో నాగార్జున షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.