సౌత్ స్టార్ హీరోయిన్ త్రిషకు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఉన్న క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు వరుస సినిమాలో నటిస్తూ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. మధ్యలో కాస్త బ్రేక్ ఇచ్చిన మళ్లీ తన సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించి.. ఇప్పుడు యంగ్ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తూ దూసుకుపోతుంది. టాలీవుడ్ లో ఎంత మంది స్టార్ హీరోయిన్లు అడుగుపెట్టిన అమ్మడి క్రేజ్ మాత్రం కాస్త కూడా తగ్గలేదంటే.. త్రిష కు ఉన్న పాపులారిటీ గురించి అర్థం చేసుకోవచ్చు.
ఇక నాలుగు పదుల వయసులోనూ యంగ్ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తున్న త్రిష.. వయస్సు పెరుగుతున్న కొద్దీ తన అందం, ఫిట్నెస్‌తో మరింతగా అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇక ప్రస్తుతం వరుసగా ఆరు సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్న త్రిష.. ఇటీవల కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి తో గోట్ మూవీలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రేక్షకులను ఊహించిన రేంజ్ లో ఆకట్టుకోలేకపోయింది. ఇక ఈ సినిమాలో త్రిష స్పెషల్ సాంగ్ లో మెరిసిన సంగతి తెలిసిందే. సాంగ్ మాత్రం సినిమాకు హైలైట్‌గా నిలిచింది. ఇక అమ్మడు పర్సనల్ విషయానికి వస్తే 41 ఏళ్ల వయసు వచ్చిన ఇప్పటికీ ఈమె వివాహం చేసుకోకుండా సింగిల్గానే ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.
కాగా.. గతంలో ఓ ప్రముఖ బిజినెస్ మ్యాన్‌ను వివాహం చేసుకోవాలనుకున్నా..ఏవో కారణాలతో అతనితో బ్రేకప్ చెప్పేసిన ఈ ముద్దుగుమ్మ.. తర్వాత మరి ఎవరిని పెళ్లి కూడా చేసుకోలేదు. ఇక చాలా కాలం నుంచి విజయ్‌తో త్రిష ఎఫైర్ నడుపుతుంది అంటూ వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇక త్రిషకు ఇటీవల కాస్ట్లీ ప్లాట్ ను.. టాప్ పొలిటికల్ లీడర్ రాసి ఇచ్చేసాడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇటీవల విజయ్ కూడా రాజకీయాల్లోకి అడుగుపెట్టి మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసింది. ఈ క్రమంలోనే విజయ్ తనకు ఆ ఫ్లాట్లో గిఫ్ట్ గా ఇచ్చి ఉంటాడు అంటూ కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. నిజంగానే త్రిషకు పొలిటిషన్ ఫ్లాట్ ని గిఫ్ట్గా ఇచ్చాడా.. అతడు విజయేనా.. కాదా.. అనే విషయాల్లో వాస్తవం ఎంతో తెలియాల్సి ఉంది.