రియల్ లైఫ్ బ్రదర్స్ ఎంతోమంది టాలీవుడ్ లో హీరోలుగా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. వారిలో అతి తక్కువ మంది మాత్రమే ఇప్పటికి స్టార్ హీరో హీరోలుగా గుర్తింపు తెచ్చుకుని రాణిస్తున్నారు. ఇక ఇండస్ట్రీలో మంచి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుని.. స్టార్ హీరోగా దూసుకుపోతున్న నటులతో సినిమా అవకాశం వస్తే.. ఎలాంటి స్టార్ హీరోయిన్ అయినా ఆ సినిమాను వదులుకోవడానికి ఇష్టపడరు. ఈ క్రమంలోనే ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు బ్రదర్స్‌తో కూడా హీరోయిన్గా నటించి ఎంతమంది హీరోయిన్స్ ఆకట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇంతకీ ఆ హీరోయిన్లు ఎవరో ఒకసారి చూద్దాం.
బాలకృష్ణ – హరికృష్ణ
నందమూరి బాలకృష్ణ – హరికృష్ణ ఇద్దరు అన్నదమ్ములతో సీనియర్ హీరోయిన్స్ సిమ్రాన్ సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. బాలయ్యతో సమరసింహారెడ్డి, నరసింహనాయుడు సినిమాలో నటించి ఆకట్టుకున్న సిమ్రాన్.. హరికృష్ణతో సీతయ్య సినిమాలో నటించి హిట్ తన ఖాతాలో వేసుకుంది.
చిరంజీవి – పవన్ కళ్యాణ్
మెగా బ్రదర్స్ చిరంజీవి – పవన్ కళ్యాణ్ ఈ ఇద్దరితోను కాజల్ అగర్వాల్, శృతిహాసన్ జాతకట్టి మంచి సక్సెస్‌లు అందుకున్నారు.
సూర్య – కార్తీ
ఇక టాలీవుడ్ స్టార్ బ్యూటీ అనుష్క అయితే.. కోలీవుడ్ బ్రదర్ సూర్య, కార్తీలతో ఇద్దరితోనే సినిమాల్లో నటించే ఆకట్టుకుంది. సూర్యతో సింగం సినిమాలో నటించి మెప్పించగా.. కార్తీతో బ్యాడ్ బాయ్ సినిమాల్లో కనిపించింది.
నాగచైతన్య – అఖిల్
ఈ జనరేషన్ బ్రదర్స్ లో నాగచైతన్య – అఖిల్ కూడా ఇండస్ట్రీలో హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు అన్నదమ్ములతో హీరోయిన్స్ రొమాన్స్ చేయడం విశేషం. సవ్యసాచి సినిమాలో నాగచైతన్యతో రొమాన్స్ చేసిన నిధి అగర్వాల్.. మిస్టర్ మజ్ను సినిమాలో అఖిల్ తోను కెమిస్ట్రీ వర్కౌట్ చేసింది.
ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్
నందమూరి ఫ్యామిలీ నుంచి అడుగుపెట్టిన మరో ఇద్దరు బ్రదర్స్ ఎన్టీఆర్ కళ్యాణ్‌రామ్ తోనూ ప్రియమణి, కాజల్ అగర్వాల్ రొమాన్స్ చేశారు.
సాయి దుర్గ తేజ – వైష్ణవ్ తేజ్
మెగా మేనల్లుళ్లు గా మంచి ఇమేజ్ని క్రియేట్ చేసుకున్న సాయి దుర్గ తేజ, వైష్ణవ తేజ్ ఇద్దరు కేతిక శర్మతో రొమాన్స్ చేశారు. రంగ రంగ వైభవంగా సినిమాల్లో కేతిక హీరోయిన్గా కనిపించింది. అలా ఇప్పటికీ ఇద్దరు రియల్ లైఫ్ బ్రదర్లతో ఒకే హీరోయిన్ నటించిన సినిమాలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా వైరల్ అవుతూనే ఉన్నాయి.