సౌత్ స్టార్ బ్యూటీలలో ఒకరిగా తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది సమంత. నాగచైతన్యతో విడాకుల తర్వాత మరింత వైరల్ గా మారిన ఈ ముద్దుగుమ్మ.. మయోసైటిస్ వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమాలకు ఏడాదిన్నర గ్యాప్ ఇచ్చిన సామ్.. తాజాగా తన సొంత బ్యానర్ పై మా ఇంటి బంగారం పేరుతో హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలో నటిస్తుంది. దీంతోపాటు సిటాడెల్ రీమేక్ సిరీస్ హనీ బన్నీ..లోను ప్రేక్షకులను ఆకట్టుకోనుందది. వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో స్పై ఏజెంట్గా సాంగ్ కనిపించనుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ లో సందడి చేస్తున్న సమంత.. సిటాడెల్ ఈ నెల 7వ తేదీన అమెజాన్ ప్రైమ్ లో ఆడియన్స్‌ను పలకరించనుంది.
ఇక ప్రస్తుతం రాజస్థాన్లో ఎన్నో ప్రదేశాలను తిరిగి చూస్తూ దీపావళిని సెలబ్రేట్ చేసుకుంటుంది. తను ఎక్కడ ఉన్నా.. ఏం చేస్తున్నా.. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన అప్డేట్స్‌ను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉండే సామ్.. ప్రస్తుతం ఫోర్ట్ బర్వరాలో ఉన్న సామ్ అక్కడ ఉద్యోగులతో దిగిన ఫోటోలు, మట్టి కుండలు తయారీ విధానానికి సంబంధించిన పిక్స్‌ను అభిమానులతో షేర్ చేసుకుంది. తన జీవితంలో ఇంత ఆనందంగా మునిపెనడు లేను.. బర్వార పర్యటన తర్వాతే ఇప్పుడు లైఫ్ అనందంగా ఉంది.. ఇప్పుడు ఉన్నంత ఆనందం నవంబర్ నెల మొత్తం ఇలానే ఉంటుంది అంటూ చెప్పుకొచ్చింది.
సిక్స్ సెన్సెస్ ఫోర్డ్ బర్వార ఇప్పుడు ఎంత అందంగా ఉందో.. అంతే అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ను నాకు అందించింది అంటూ చెప్పుకొచ్చింది. బార్వారకు కృతజ్ఞతలు అంటూ పోస్ట్ షేర్ చేసుకుంది. ఇక సమంత ఇలా సోషల్ మీడియాలో తన అప్డేట్స్ షేర్ చేస్తూ వ్యూస్ ను సంపాదించడం ద్వారా కూడా ఆదాయాన్ని గడుస్తుంది. రెండు సంవత్సరాల నుంచి సినిమాలు చేయకపోయినా టాలీవుడ్ నెంబర్ వన్ గా ఇంకా ఇమేజ్ను కొనసాగిస్తుందంటే దానికి కారణం కూడా అదే అనడంలో అతిశయోక్తి లేదు. ఇటీవల బాలీవుడ్ మీడియా ఓర్మాక్స్ నిర్వహించిన సర్వేలో కూడా ఇది వెళ్ళడయింది. ప్రతిసారి దాదాపు మొదటి స్థానం సమంతకే దక్కుతుండడం విశేషం.