టాలీవుడ్ నేషనల్ క్రష్ రష్మిక మందన ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో యూత్ కలల రాణిగ దూసుకుపోతుంది. తన సినిమాలతో ఎప్పటికప్పుడు సంచలనం సృష్టిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఈ అమ్మడికి సంబంధించిన ఏ ఫోటో వచ్చిన.. పోస్ట్ వచ్చిన టక్కున వైరల్‌గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా రష్మిక పోస్ట్ కు బ్యాడ్మింటన్ ప్లేయర్ కాదంబి శ్రీకాంత్ రియాక్ట్ అయ్యారు. మహారాణిలా చూసుకుంటానంటూ స్పందించాడు. ఇంతకీ రష్మిక షేర్ చేసిన పోస్ట్ ఏంటి. దానికి శ్రీకాంత్ ఎందుకలా రియాక్ట్ అయ్యాడో ఒకసారి చూద్దాం.
టాలీవుడ్ స్టార్ స్టైలిష్ట్ శ్రావ్య వర్మ త్వరలోనే శ్రీకాంత్‌ను వివాహం చేసుకోనున్నాడు. ఈ క్రమంలోనే శ్రావ్య తన స్నేహితులందరికీ బ్యాచిలర్ పార్టీ ఇచ్చింది. ఇందులో రష్మిక మందన్న, వర్షా బొల్లమా కూడా పాల్గొని సందడి చేశారు. ఈ ఫోటోలను శ్రావ్య తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. నా గర్ల్ గ్యాంగ్ తో సింగిల్గా ఇదే నా లాస్ట్ వీకెండ్ అంటూ చెప్పుకొచ్చింది. దీనిపై రష్మిక రియాక్ట్ అవుతూ.. శ్రావ్యా వర్మ మేడం పెళ్లి చేసుకుంటుంది. శ్రీకాంత్ కాదంబి ఇకపై తన బాధ్యత మీదే.. ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకోండి అంటూ పోస్ట్ ను షేర్ చేసుకుంది.
దానికి శ్రీకాంత్ రియాక్ట అవుతూ ” మహారాణిలా చూసుకుంటా ” అని రిప్లై ఇచ్చారు. ఇక శ్రావ్య వర్మ ఇప్పటికే నాగార్జున, విజయ్ దేవరకొండ, వైష్ణవ తేజ్, విక్రమ్, ధృవ లాంటి ఎంతమంది హీరోలకు స్టైలిష్ గా వ్యవహరించింది. అయితే శ్రావ్య రామ్ గోపాల్ వర్మ మేనకోడలు అన్న సంగతి చాలామందికి తెలిసి ఉండదు. అంతేకాదు ఆర్జీవి సినిమాలకు ఈమె పని చేసిందా.. లేదా.. అనే అంశాలపై కూడా ఎలాంటి క్లారిటీ లేదు.