త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న అల్లు శిరీష్.. అమ్మాయి ఎవరంటే..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ కు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక తాజాగా అల్లు శిరీష్ కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ గా మారుతుంది. త్వరలోనే అల్లు శిరీష్ బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పేసి.. వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నాడట‌. పెళ్లి పీటలెక్కనున్నాడని సమాచారం. ఇక ఈ హీరో తను ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నాడు అంటూ తెలుస్తుంది. ముంబైలో యాక్టింగ్ నేర్చుకుంటున్న క్రమంలోనే ఓ అమ్మాయితో ప్రేమ‌లో పడ్డాడట శిరీష్‌. ఈ విషయాన్ని ఇరు కుటుంబాల పెద్దలకు చెప్పి ఒప్పించాడని.. వారు కూడ‌ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం.

Who Is Allu Sirish, The Younger Brother Of Allu Arjun? What Does He Do? -  News18

అయితే ఈ వార్తల వాస్తవం ఏంటో తెలియదు కానీ.. ప్రస్తుతం న్యూస్ నెటింట‌ తెగ వైరల్‌గా మారుతుంది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు.. ఆమె ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి.. అనే విషయాలపై మాత్రం క్లారిటీ లేదు. ఇక గతంలో అల్లు శిరీష హీరోయిన్ తో ప్రేమలో ఉన్నాడంటూ వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆమె ఎవ‌రోకాదు ఊర్వశివే రాక్షసివే సినిమా చేస్తున్న క్రమంలో అనూ ఇమ్మాన్యులతో ఆయన ప్రేమలో పడ్డాడని పుకార్లు తెగ వైరల్ గా మారాయి. అయితే ఈ వార్తను అల్లు శిరీష్ ఖండించాడు. యాక్టర్లుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తర్వాత ఇలాంటి రూమర్లు కామన్ గానే వస్తూ ఉంటాయని.. కోస్టార్‌తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు సహజంగా మారిపోయాయి అంటూ చెప్పుకొచ్చాడు. గతంలో ఇలాంటి వార్తలే వచ్చాయని ఇద్దరు మంచి స్నేహితులమని ఆయన వెల్లడించాడు.

అల్లు ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన శిరీష్.. తనకంటూ ప్రత్యేకమైన అభిమానాన్ని సంపాదించుకున్నారు. ఇక అన్న అల్లు అర్జున్ కున్న రేంజ్ లో క్రేజ్ ఆయన సంపాదించుకోకపోయినా.. గౌరవం సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. కొత్తజంట, ఏబిసిడి, క్షణక్షణం, శ్రీరస్తు శుభమస్తు, ఊర్వశివో రాక్షసివో సినిమాలతో మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. అయితే సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చిన ఊహించిన సక్సెస్ అందలేదు. ఇక తాజాగా శిరీష్ బడ్డి సినిమాతో ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కూడా ఆడియన్స్‌కు తీవ్ర నిరాశ మిగిల్చింది. ఇక శిరీష్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సినిమా విశేషాలతో పాటు.. పర్సనల్ లైఫ్‌ను కూడా అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటాడు. ఎవరైనా ప్రమాదంలో ఉంటే వెంటనే తన సహాయాన్ని అందించడంలో ముందు ఉంటాడు. ఇటీవల ఓ పేద విద్యార్థికి ఆయన లాప్టాప్ అందించి ఎంతో మంది ప్రశంసలు దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే శిరీష్ ఓ ఇంటి వాడవుతున్నాడని అభిమానులు తెగ సంబ‌ర ప‌డిపోతున్నారు.