పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా మూవీ ది రాజాసాబ్. శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తైందని సమాచారం. ఇక ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుందట. సినిమాకు ఇది మరింత ప్లస్ కానుందని టాక్ నడుస్తుంది. ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ సాధించాలని మారుతి తెగ ఆరాటపడుతున్నాడు. కచ్చితంగా తనని తాను ప్రూవ్ చేసుకునే దిశగా సినిమాను తెరకెక్కిస్తున్న మారుతి.. కథ, కథనం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం.
ఈ క్రమంలోనే సినిమాలో ప్రభాస్ త్రిపాత్ర అభినయం చేయనున్నట్లు సమాచారం. ప్రభాస్ తాత పాత్రలో సంజయ్ దత్త్ కనిపించనున్నాడట. సంజయ్ దత్.. ప్రభాస్ ఫ్లాష్ బ్యాక్ పాత్రకు మధ్య వచ్చే సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని.. సమాచారం. వైట్ హెయిర్ లుక్ లో ప్రభాస్ పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలుస్తోంది. ప్రభాస్ దెయ్యం పాత్రలో కనిపించనున్నారని.. తనను మోసం చేసిన సంజయ్ దత్ పై పగ తీర్చుకునే ఆత్మగా ప్రభాస్ నటించనున్నాడని సమాచారం. ఇక ఈ సినిమా చంద్రముఖి, నాగవల్లి సినిమాల తరహాలో కొన్ని సన్నివేశాలు ఆడియన్స్‌ను భయపెడుతుందట.
ఇక రాజా సాబ్ సినిమా ఏప్రిల్ 10న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇక సినిమాను రూ.300 నుంచి రూ.400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారట. ప్రభాస్ రాజ్యసభ కలెక్షన్ల పరంగా అదరగొట్టడం పక్క అంటూ అభిమానులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక సమ్మర్ కానుకగా సినిమాను రిలీజ్ చేయడం సినిమాకు మరింత ప్లస్ అవుతుందన్నడంలో సందేహం లేదు. మారుతీ గత మూడు సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకులను నిరాశపరచడంతో.. ఈ సినిమాతో ఎలాగైనా తనను తాను ప్రూఫ్ చేసుకోవాల్సి ఉంది. ఇక ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ విషయంలో టాప్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రభాస్‌తో సినిమా మారుతికి సక్సెస్ అందిస్తుందో లేదో చూడాలి.