తెలుగు సినీ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో ఇండస్ట్రీలో జర్నీ ప్రారంభించి తాజాగా వచ్చిన దేవర సినిమా వరకు ప్రతి సినిమాలోని తనకంటూ వైవిధ్యతను చూపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు ఎన్టీఆర్. ఎప్పటికప్పుడు సక్సెస్ అవుతూ వస్తున్న తారక్ డ్యాన్స్, డైలాగ్ డెలివరీ ఇలా ప్రతి విషయంలోనూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక తన పర్సనల్ లైఫ్ కూడా చాలా వరకు తెరిచిన పుస్తకమే. హరికృష్ణకు రెండో భార్యకు తారక్ పుట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. చిన్నప్పటి నుంచి నందమూరి ఫ్యామిలీ అయనను కాస్త దూరం పెడుతూ వచ్చేవారు.
ఈ క్రమంలోనే తారక్ తల్లితో ఉంటూ చదువుతోపాటు.. డ్యాన్సులపై కూడా శ్రద్ధ పెట్టాడు. అలా.. చాలా సంవత్సరాలు పాటు కల్చరల్ ఆక్టివిటీస్ లో సందడి చేసిన తారక్.. చిన్నప్పటి నుంచి హైపర్ ఆక్టివ్ గా ఉండేవాడట. ఇదిలా ఉంటే తారక్‌తో తన తాత సీనియర్ ఎన్టీఆర్ మాట్లాడడానికి దాదాపు 11 సంవత్సరాల టైం పట్టింది. ఆ మధ్యలో తను ఎప్పుడు వెళ్ళినా కూడా.. సీనియర్ ఎన్టీఆర్ అసలు.. ఎన్టీఆర్‌తో మాట్లాడేవాడే కాదట. అలాంటిది ఒక రోజు తనే పిలిపించుకొని మరి జూనియర్ ఎన్టీఆర్ తో మాట్లాడి తన పేరుని కూడా ఎన్టీఆర్ అని పెట్టారని.. ఇప్పటికే చాలామంది చాలాసార్లు వివరించారు. ఇక తారక్ చిన్నతనంలో వాళ్ళ తాత సీనియర్ ఎన్టీఆర్ ఒక్కసారైనా మాట్లాడితే బాగుండని.. చాలా సార్లు బాధపడేవాడట.
ఈ విషయాన్ని ఓ సందర్భంలో తారక్ తల్లి షాలిని స్వయంగా వివరించారు. ఇక అలాంటి తారక్.. ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ లాగా సినీ లెగసీ మరింత ముందుకు తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. నందమూరి ఫ్యామిలీ నుంచి అడుగు పెట్టి హీరోలుగా రాణిస్తున్నవారందరిలో తారక్ టాప్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. నందమూరి ఇమేజ్ను కాపాడే బాధ్యతలు క్యారీ చేస్తున్నారు. బాలయ్య పల్లు సినిమాల్లో నటించి మంచి సక్సెస్ సాధిస్తున్న.. ప్రస్తుతం ఆయన జనరేషన్ ముగుస్తున్న క్రమంలో.. తారక్ పై ఈ బాధ్యత అంతా పడింది. ఇక నందమూరి ఫ్యామిలీ మధ్యలో ఎలాంటి గొడవలు ఉన్నా.. అభిమానులు మాత్రం అందరి సినిమాలను చూడడానికి ఆసక్తి చెప్తూ ఉంటారు. ఏది ఏమైనా తారక్ లాంటి నటుడు ఇండస్ట్రీలో ఉండడం నిజంగా తెలుగు సినిమా అదృష్టం అనడంలో అతిశయోక్తి లేదు.