అన్‌స్టాపబుల్ 4 టాక్‌షో సీజన్ 4 గ్రాండ్గా ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. మొదటి ఎపిసోడ్ కు ఏపీ సీఎం నారా చంద్రబాబు హాజరై సందడి చేశారు. ఇక రెండో ఎపిసోడ్ కు మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ హాజరయ్యారు. ఈ ఎపిసోడ్ దీపావళి కానుకగా అక్టోబర్ 31న రిలీజై మంచి వ్యూస్ సంపాదించింది. ఇప్పటివరకు రిలీజ్ అయిన రెండు ఎపిసోడ్స్‌తో పాటు.. మరికొందరు స్టార్స్‌తో కూడా ఎపిసోడ్స్ పూర్తి చేశాడు బాలయ్య.
వాటిలో భాగంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 ఎపిసోడ్ కూడా షూట్ను ఫినిష్ చేసుకుందని సమాచారం. అయితే ఈ ఎపిసోడ్లో అల్లు అర్జున్‌తో పాటు.. ఆయన పిల్లలు అర్హ, ఆయాన్ కూడా పాల్గొని సందడి చేశినట్లు సమాచారం. ఇక షో హస్ట్.. నందమూరి బాలయ్య పిల్లలిద్దరితో సరదాగా ముచ్చటించాడని.. ఎన్నో ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు అడిగారని సమాచారం. ఇందులో భాగంగానే అల్లు అయాన్‌ని.. నీ ఫేవరెట్ హీరో ఎవరు అని బాలయ్య ప్రశ్నించగా.. అయాన్ రియాక్ట్ అవుతూ తను రెబల్ స్టార్ ప్రభాస్ అంటే చాలా ఇష్టం అని చెప్పాడట.
ఈ క్రమంలో షోకు హాజరైన ఆడియన్స్ అంతా చప్పట్లు, విజిల్స్ తో వేదికను మారుమోగించారట. ఇక ప్రభాస్ చేసే యాక్షన్ సీన్స్ చాలా ఇష్టమని ఆయాన్ చెప్పినట్లు న్యూస్ నెటింట తెగ వైరల్‌గా మారింది. అయితే ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్‌కు చాలా సమయం పట్టనుంది. పుష్ప 2 రిలీజ్ డిసెంబర్లో ఉండడంతో.. డిసెంబర్ మొదటి వారం ఈ ఎపిసోడ్ రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.