మెగాస్టార్ చిరంజీవికి ప్రస్తుతం టాలీవుడ్ ప్రజలలో ఎలాంటి ఇమేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు నాలుగు దశాబ్దల కాలంగా సినీ ప్రస్థానాన్ని స్టార్ హీరోగా కొనసాగిస్తున్న చిరంజీవి.. కెరీర్ మొదట్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఆయన లైఫ్ లోను హిట్లకోసం సతమతమైన సందర్భాలు ఉన్నాయి. 1997లో ముఠామేస్త్రి సినిమా రిలీజై మంచి సక్సెస్ సాధించింది. ఈ సినిమాకు ఏ కోదండరామిరెడ్డి దర్శకుడుగా వివరించారు. ఇక ముఠామేస్త్రి సినిమా తర్వాత చిరుకి వరుస ప్లాప్స్ ఎదురుకావడం.. చిరును నిరాశపరిచింది. ముఠామేస్త్రి వచ్చిన ఏడాదిలోనే ఏఎన్ఆర్ తో కలిసి చిరంజీవి నటించిన మెకానిక్ అల్లుడు సినిమా తెరకెక్కి ఫ్లాప్ గా నిలిచింది.
ఈ సినిమా తర్వాత ముగ్గురు మొనగాళ్లు సినిమాలో నటించారు. ఈ సినిమా పర్లేదు అనిపించుకున్న సరైన సక్సెస్ దక్కలేదు. ఇక ఈవివి సత్యనారాయణ డైరెక్షన్‌లో తెరకెక్కిన అల్లుడా మజాకా సక్సెస్ అందుకున్నా అత్తను రేపు చేసిన అల్లుడుగా.. చిరంజీవి నెగటివ్ రోల్ లో కనిపించడంతో ఆయనపై విమర్శలు వర్షం కురిసింది. ఈ సినిమా తర్వాత బిగ్‌బాస్, రిక్షావాడు డిజాస్టర్‌గా నిలిచాయి. దీంతో చిరంజీవి తీవ్ర నిరాశను ఎదుర్కొన్నారట. అసలు ఎలాంటి మూవీ చేయాలని ఆలోచనలో పడ్డాడట. ఇలాంటి క్రమంలో ఆయనకు ఓ రీమిక్ సినిమా అవకాశం వచ్చింది. డైరెక్టర్ సిద్ధిఖి మలయాళం లో తెరకెక్కించిన హిట్లర్.. సినిమాను రీమేక్ చేసాడు చిరు. హిట్లర్ మలయాళం లో సూపర్ హిట్ గా నిలిచింది. ఐదుగురు చెల్లెల్లు అన్నగా చిరు ఈ సినిమాలో కనిపించారు.
అయితే సినిమాలో రంభ హీరోయిన్గా నటించిన ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్లు సినిమా రూపొందింది. ఇక స్క్రిప్ట్ గురించి డిస్కషన్ జరుగుతున్న క్రమంలో.. ఎడిటర్ మోహన్, డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య మీటింగ్లో ఉన్నారు. ఇక ఈ మీటింగ్ లో హీరో చెల్లి ప్రేమను తిరస్కరిస్తాడని.. పాయింట్ను ఆఫీసులో పనిచేస్తున్న ఆఫీస్ బాయ్ విన్నాడట. హీరో, చెల్లెలి ప్రేమను వ్యతిరేకిస్తే అతడు హీరో ఎందుకు అవుతాడు.. విలన్ అవుతాడు కానీ.. అని ఆఫీస్ బాయ్ కామెంట్స్ చేశాడట. ఇక ఆయన కామెంట్ విన్న ఎడిటర్ మోహన్ కి కూడా అది నిజమే అనిపించింది. ఆఫీస్ బాయ్ పాయింట్ నచ్చడంతో దానికి అనుగుణంగా కథలో మార్పులు చేర్పులు చేసి.. డైరెక్టర్ 1996లో హిట్లర్ సినిమాను తెర్కెక్కించారు. ఇక చిరంజీవి నటించిన ఈ సినిమా రిలీజై ఆయన మరోసారి సక్సెస్ ట్రాక్ లో నిలబెట్టింది. అప్పటివరకు ఫ్లాప్ లతో కొట్టుమిట్టాడుతున్న చిరంజీవికి ఒక్కసారిగా కోటి రూపాయల కలెక్షన్లను కొల్లగొట్టి మళ్లీ గట్టి త్రో బాక్ ఇచ్చింది.