తారక్ కు పెద్ద ఎదురుదెబ్బ.. ఇక ఎన్టీఆర్ పని అయిపోయిందా.. ?

టాలీవుడ్ లో సూపర్ పాపులారిటీతో స్టార్ హీరోగా దూసుకుపోతున్న వారిలో తారక్ ఒకరు. దేవర పార్ట్ 1తో ఇటీవల ఆడియన్స్ పలకరించి.. భారీ సక్సెస్ అందుకొని మంచి ఫామ్ లో ఉన్నాడు తార‌క్‌. తమిల్, కన్నడ, హిందీ, మ‌ళ‌యాళ భాషల్లో సెప్టెంబర్ 27న గ్రాండ్‌గా రిలీజ్ అయిన ఈ సినిమా.. అదిరిపోయా రేంజ్లో కలెక్షన్లను కొల్లగొట్టింది. ఇప్పటికే రూ.500 కోట్లకు పైగా కలెక్షన్లను దక్కించుకుంది. ఇక రిలీజ్ తర్వాత కాస్త నెగటివ్ టాక్ రావడం.. సినిమా కలెక్షన్లపై ప్రభావం పడుతుందని అంతా భావించారు.

ఈ సినిమా తర్వాత ఏదైనా సినిమా రిలీజై హిట్ టాక్ వస్తే.. ఇక సినిమా భారీ నష్టాలను చూడాల్సిందే అని అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అయితే దేవర సినిమా రిలీజై నెగిటీవ్‌ టాక్‌ వచ్చినా.. మెల్లమెల్లగా పాజిటివ్ టాక్ రావడం తర్వాత రిలీజ్ అయిన ఏ సినిమాలు అదిరిపోయే రేంజ్‌లో టాక్‌ సంపాదించకపోవడంతో.. దేవ‌ర‌ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు చాలా రోజులపాటు సాలిడ్‌గా కొల్లగొడుతుంది. ఇక తాజాగా దీపావళి సెలబ్రేషన్స్‌లో భాగంగా.. 31న టాలీవుడ్ బాక్సాఫీస్‌లో ఒక్కసారిగా.. క, లక్కీ భాస్కర్, అమరాన్, భఘీర‌ నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి.

ఇందులో క, ల‌క్కీ భాస్కర్, అమరాన్ మూడు సినిమాలు కూడా మంచి సక్సెస్ సాధించడం.. మూడు సినిమాలు బ్లాక్ బాస్టర్ తెచ్చుకోవడంతో ఇక తెలుగు రాష్ట్రాల థియేటర్లు వీటికి చాలడం లేదు. ఈ క్రమంలోనే దేవర కలెక్షన్లు కూడా తగ్గడంతో తెలుగు రాష్ట్రాల్లో దేవర సినిమాను తీసేసి.. మూడు సినిమాలను వేసే అవసరం ఉందని ఎంతోమంది అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది తార‌క్ దేవ‌ర‌కు పెద్ద ఎదురుదెబ్బ అంటూ.. ఇక దేవ‌ర ప‌ని అయిపోయిన‌ట్టే అంటూ ప‌లువురు కామెంట్లు చేస్తున్నారు.