అతి చిన్న వయసులోనే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రెజీనా.. స్టార్ హీరోయిన్‌గా తెలుగు, తమిళ్ సినిమాలలో మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. ఇక ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాలీవుడ్ ఇండస్ట్రీ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. సౌత్ నుంచి బాలీవుడ్ లో అడుగుపెట్టే ఎంతోమంది భాష విషయంలో ఇబ్బందులు పడుతూ ఉంటారని.. వారిలో నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారంటే చెప్పుకొచ్చింది.
మనకు లాంగ్వేజ్ రాదంటే బాలీవుడ్ సినిమాల్లో సెలెక్ట్ చేయడానికి వాళ్ళు అసలు ఇష్టపడరని.. సౌత్‌లో అలా ఉండదు.. భాష రాకపోయినా సినిమాకి సెలెక్ట్ చేసేస్తారు. పైగా బాలీవుడ్ లో పనిచేయాలనుకుంటే ముంబైలోనే ఉండాలంటారు. మీటింగ్స్ కు హాజరవుతూ ఉండాలని చెబుతారు. సౌత్ లో ఇలాంటి రూల్స్ ఏమి ఉండవు అంటూ చెప్పుకొచ్చింది. కాస్టింగ్ ఏజెన్సీ అన్న పదానికి కూడా తావుండదని.. కేవలం మేనేజర్లు, పిఆర్వో లే ఇవి అని చూసుకుంటూ ఉంటారంటూ వెల్లడించింది.
ఇప్పుడిప్పుడే టాలెంట్ మేనేజ్మెంట్ ఏజెన్సీలు కూడా సౌత్ లో మొదలయ్యాయని.. ఇకపోతే బాలీవుడ్ లో ఎక్కువ కాంపిటీషన్ ఉంది. అలా అని నాకు త్వరగా ఆఫర్స్ కోసం నేను ఎప్పుడూ నన్ను అమ్ముకోలేదంటే చెప్పుకొచ్చింది. కానీ ఇలా మొండిగా ఉంటే ఆఫర్స్ రావని లేటుగా తెలుస్తోంది. అందుకే నాకంటూ ఓ టీం ఏర్పాటు చేసుకున్నా. వాళ్ళు నాకోసం సంబంధిత వ్యక్తులతో భేరసారాలు, సంప్రదింపులు జరుపుతూ ఉంటారంటూ రెజినా వెల్లడించింది. ప్రస్తుతం రెజీనా సౌత్, నార్తఖ ఇండస్ట్రీలలో వ్యత్యాసంపై చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.