నెగిటివ్ రివ్యూ చూపిస్తే అందరికీ పార్టీ ఇస్తా.. నాగ వంశీ కామెంట్స్ వైరల్..

మహానటి, సీతారామం సినిమాలతో టాలీవుడ్ లో మంచి క్రేజ్‌ సంపాదించుకున్న దుల్క‌ర్ తాజా మూవీ లక్కీ భాస్కర్. ఈ సినిమాలో హీరోయిన్గా మీనాక్షి చౌదరి నటించింది. దీపావళి కానుకగా అక్టోబర్ 31 థియేటర్లో రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ రోజే పాజిటీవ్ టాక్‌ని తెచ్చుకుని మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది. వసూళ్లపరంగా బాక్సాఫీస్ దగ్గర రాణిస్తున్న ఈ సినిమాను సీతారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై.. సూర్యదేవరనాగ వంశీ ప్రొడ్యూసర్గా వ్యవహరించారు. అయితే ఈ సినిమా రిలీజ్ కి ముందు మీడియా ఫ్రెండ్స్ అందరికి పార్టీ ఇస్తానని నాగ‌వంశీ మాట ఇచ్చాడు.

Lucky Baskhar (2024) - IMDb

ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నాగవంశీ మాట్లాడుతూ.. ఒక నెగటివ్ రివ్యూ గాని.. నెగటివ్ కామెంట్ గాని చూపిస్తే అందరికీ పార్టీ ఇస్తానంటూ చెప్పుకొచ్చాడు. తాజాగా హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఈ విషయంపై ఆయన రియాక్ట్ అవుతూ.. లక్కీ భాస్కర్ లో నెగటివ్ పాయింట్ ను ఎవరు పట్టుకోలేకపోయారు అంటూ ధైర్యంగా కామెంట్స్ చేశాడు. ఇంత ధైర్యంగా పార్టీ ఇస్తానని చెప్పినా కూడా ఎవరు నెగటివ్ కామెంట్స్ ను చేయలేకపోయారని.. ఇంతకంటే పెద్ద హిట్ ఎవరైనా కొడతారా అంటూ నాగవంశి డేరింగ్ కామెంట్స్ చేశారు.

Lucky Bhaskar Collection Day 1: ദീപാവലി വിന്നർ ലക്കി ഭാസ്കർ തന്നെ; ആദ്യദിനം  നേടിയത് 12 കോടിയിലധികം

ఇప్పుడు మీకు తప్పును పట్టుకోలేకపోయినందుకు పార్టీ ఇవ్వాలి అంటూ ఫన్నీగా చెప్పుకొచ్చాడు. కాగా.. వంశీ అట్లూరి డైరెక్షన్ లో తెర‌కెక్కిన ఈ సినిమాని డబ్బే మెయిన్ లీడ్‌గా తీసుకొని తెరకెక్కించారు. 1992లో జరిగిన హర్షద్ మెహతా స్కామ్‌కు కాస్త టచ్ చేసే విధంగా సినిమాను ఆధ్యాంతం ఎంటర్టైన్ చేసే దిశగా రూపొందించారు. మూవీ మొదటి రోజు రూ.12.7 కోట్ల గ్రాస్ కలెక్షన్లను కొల్లగొట్టి రికార్డ్ సృష్టించింది. తాజాగా ఈ విషయాన్ని అఫీషియల్ గా మేకర్స్ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు.