న్యూయార్క్ లో మహేష్ కొడుకు సందడి.. గౌతమ్ కృష్ణ రీల్స్ వైరల్ ..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. కొడుకు గౌతమ్ కృష్ణ, కూతురు సితారలు ఇప్పటికే ఇండస్ట్రీలో మంచి పాపులారిటీ దక్కించుకున సంగ‌తి తెలిసిందే. మహేష్ బాబు వన్ నేనొక్కడినే సినిమాతో గౌతమ్ కృష్ణ కూడా చిన్నప్పటి సూపర్ స్టార్ పాత్రలో కనిపించి ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం తన ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయడంపై ఫోకస్ పెట్టిన గౌతమ్.. న్యూయార్క్ లో చదువుకుంటూ బిజీగా గడుపుతున్నాడు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన పోస్టులతో అభిమానులకు ట్రీట్ ఇస్తున్న గౌతమ్ కృష్ణ.. కొద్దిరోజుల క్రితం న్యూయార్క్ యూనివర్సిటీలో లైఫ్ గురించి.. అభిమానులతో షేర్ చేసుకున్నాడు.

Super Star Mahesh Babu and Family at Gautam Ghattamaneni's Graduation Day | Namrata | Sitara

తన ఫ్రెండ్ తో కలిసి తిరగడం నుండి రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించడం వరకు గౌతమ్ అన్ని విషయాలను సరదాగా పంచుకున్నాడు. యూనివర్సిటీ పార్ట్ 2 అంటూ క్రేజీగా క్యాప్షన్ షేర్ చేసిన గౌతమ్.. తర్వాత పార్ట్3, పార్ట్ 4 పేరుతో పిక్స్ షేర్ చేసుకున్నాడు. ఆ పిక్స్ నెటింట‌ తెగ వైరల్ గా మారాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో గౌతమ్‌కు సంబంధించిన మరో క్రేజీ రీల్ వైరల్ అవుతుంది. గౌతమ్ తన ఫ్రెండ్స్ తో కలిసి రోడ్డుపై వెళ్తుండగా యూట్యూబర్‌.. మూడు బాలీవుడ్ సాంగ్స్ మ్యూజిక్ ప్లే చేస్తూ సినిమా పేర్లను చెప్పమంటాడు. గెస్ చేస్తే 100 డాలర్స్ అని ఆఫర్ చేయడంతో గౌతమ్ ఫ్రెండ్స్ గ్యాంగ్ అంతా ఆ పాటలను గెస్ చేసి చెప్తారు.

Gautam's NY Diaries: Sleepovers, Dinners & Fun!

అలా మూడు పాటలను మ్యూజిక్ ప్లే చేయగా మూడు పాటలను గెస్ చేసి వాళ్ళు సమాధానం చెప్పడంతో.. గౌతమ్ ఫ్రెండ్స్ టీంకు యూట్యూబ‌ర్ వంద డాలర్లు ఇస్తాడు. ఆ యూట్యూబర్ వాటితో ఏం చేస్తారని ఆ ఫ్రెండ్స్ ను అడగగా.. వాళ్లంతా పానీపూరి తింటామంటూ వెల్లడిస్తారు. దీంతో గౌతమ్ ఫుల్ గా నవ్వేస్తాడు. ఆ వీడియో ఇప్పుడు నెటింట‌ తెగ వైరల్ గా మారింది. దీంతో మహేష్ ఫ్యాన్స్ అంతా తెగ సంబర పడుతున్నారు. గౌతమ్ బాబు వాయిస్ లో బేస్ అదిరిపోయింది అంటూ.. ఫ్రెండ్స్‌తో గౌతమ్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో రీల్ తెగ వైరల్ గా మారింది.