స్టార్ బ్యూటీ సిల్క్ స్మిత ఒకప్పుడు ఇండియన్ సినిమానే షేక్ చేసిన ఈ అమ్మడు వ్యాంప్ పాత్రలతో, ఐటమ్ సాంగ్‌లతో కుర్ర కారును విపరీతంగా ఆకట్టుకుంది. తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకుంది. తను నటించిన ప్రతి పాత్రతోను ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న స్మిత.. ఇండియన్ సినిమాల్లోనే ఓ అరుదైన నటిగా మిగిలిపోయింది. కేవలం 18 ఏళ్ల సినిమా జీవితంలో.. 450కు పైగా సినిమాల్లో నటించి ఎన్నో సక్సెస్‌లు చూసిందంటే అప్పట్లో ఆమె రేంజ్ ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. స్టార్ హీరోలకు దీటుగా అప్పట్లో ఆమె రెమ్యూనరేషన్ ఉండేది. కాల్ షీట్ల కోసం ఎంతోమంది పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. కటిక పేదరికంలో జన్మించిన ఈమె హై స్కూల్ స్టేజ్ లోనే చదువు మానేసి పనికి వెళ్ళేది. కొద్ది రోజులకే అమ్మడికి పెళ్లి చేశారు.
అయితే అప్పటికే ఆమె భర్తకు.. పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారు. ఆ పెళ్లి తనకు ఇష్టం లేదు. పైగా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్నో వేధింపులు చూసిందట. దీంతో అక్కడ నుంచి పెళ్లి లైఫ్ కి గుడ్ బై చెప్పేసి చెన్నై పారిపోయి సినిమా అవకాశాల కోసం ప్రయత్నించింది. తమిళ్ డైరెక్టర్ విను చక్రవర్తి.. విజయలక్ష్మి వడ్లపాటితో ఆయన రూపొందించిన సినిమా వండిచక్కరం లో ఛాన్స్ ఇచ్చి నటింపజేశారు. అయితే సినిమా రిలీజ్ కు చాలా టైం పట్టింది. ఇంతలోనే మలయాళ ఆఫర్లు దక్కించుకొని అందులో కెరీర్‌ను ప్రారంభించింది. తొలి సినిమాలోనే ఆమె నటించిన పాత్ర పేరును తన పేరుగా మార్చాడు దర్శకుడు. అలా విజయలక్ష్మి పేరు కాస్త సిల్క్ స్మితగా మారిపోయింది. హీరోయిన్ గా మారి ఎన్నో సినిమాల్లో నటించిన స్మిత.. వచ్చిన ఏ అవకాశాన్ని కాదనకుండా నటిస్తూ అతి తక్కువ టైంలోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది.
ఈ క్రమంలో తనకు బాగా తెలిసిన ఆర్ఎంపీ డాక్టర్ రాధాకృష్ణ పై నమ్మకం ఉంచింది. తన అకౌంట్స్ అని అతనికి అప్పగించింది. ఈ క్రమంలో అతను స్మితను మోసం చేయడంతో రోడ్డుకు వచ్చేసింది. ఎంత పేదరికంలో పెరిగిందో సినిమాల్లోకి వచ్చాక అంతే లగ్జరీ లైఫ్‌ను ఎంజాయ్ చేసిన స్మిత.. రాధాకృష్ణ చేసిన మోసాన్ని భరించలేకపోయింది. ఆయనకు కూడా అప్పటికే పెళ్ళై పిల్లలు ఉన్నా.. ఆమెను గట్టిగా వాడుకున్నాడు. ఈ క్రమంలో చివరి దశలో సినిమా ఆఫర్ల కోసం ఎంతోమంది కమిట్మెంట్ తీసుకుని కూడా అవకాశాలు ఇవ్వకుండా వదిలేశారు. ఇలా ఎన్నో మోసాలు చూసిన స్మిత తాగుడుకు బానిసై.. డిప్రెషన్‌తో ఆత్మహత్య చేసుకుంది. 1996 సెప్టెంబర్ 23న ఆమె చనిపోయింది.
అయితే ఈమె అంత్యక్రియలకు ఇండస్ట్రీ నుంచి ఎవరు రాలేదు. ఎంతోమంది స్టార్ హీరోలు, సూపర్ స్టార్స్, చిన్న హీరోస్ అని తేడా లేకుండా సిల్క్ స్మిత అందరితోనూ నటించి మెప్పించింది. కానీ తన చివరి చూపు కూడా ఎవరు వెళ్ళని పరిస్థితి. అయితే ఆమెను కడసారి చూసేందుకు ఒక్క హీరో మాత్రం వెళ్లడట. అతను ఎవరో కాదు యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా. ఆయన మాత్రమే రావడానికి కూడా కారణం అర్జున్‌తో కలిసి స్మిత ఓ మూవీలో నటించింది. ఆ టైంలో నేను చనిపోతే నువ్వైనా వస్తావా అని అర్జునుని సరదాకి అడిగిందట. ఆ టైంలో అర్జున్ వస్తానని మాటిచ్చాడట. అయితే అంత త్వరగా ఇలా అవుతుందని ఆయన కూడా అనుకోలేదు. అందుకే ఆమె చివరి కోరిక నెరవేర్చడం కోసం తాను వెళ్ళినట్లు అర్జున్ వెల్లడించడం విశేషం.