టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పాన్ వరల్డ్ సినిమా కోసం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి డైరెక్షన్‌లో యాక్షన్ అడ్వెంచరస్ డ్రామాతో ఆడియన్స్‌ను పలకరించనున్నాడు మహేష్. ఇక వచ్చేయడాది జనవరి నుంచి ఈ సినిమా షూట్ ప్రారంభం కానుందట. ఈ క్రమంలో మహేష్ తన న్యూ లుక్.. అలాగే బాడిని కూడా డెవలప్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో మహేష్ బాబుకు సంబంధించిన ఓల్డ్ పిక్స్ చక్కర్లు కొడుతున్నాయి.
వాటిలో ఈ పై ఫోటో కూడా ఒకటి. ఇందులో మహేష్ బాబు పక్కన కనిపిస్తున్న ఆ కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా.. అతను ఓ స్టార్ హీరో కొడుకు. టాలీవుడ్ యంగ్ హీరో. ఎంతోమంది అమ్మాయిల డ్రీమ్ బాయ్. తన క్యూట్ నెస్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాడు. అతను ఎవరో కాదు శ్రీకాంత్ తనయుడు రోషన్. ఇప్పటికే నిర్మల కాన్వెంట్ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చి పెళ్లి సందడి సినిమాతో హీరోగా మారిన రోషన్ ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకున్నాడు.
పెళ్లి సందడి మంచి సక్సెస్ అందుకోవడంతో.. ఒక్కసారిగా ఈ హీరో క్రేజ్ పెరిగిపోయింది. తాజాగా రోషన్ మరో సినిమాతో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలోనే మహేష్‌తో కలిసి రోషన్ చిన్నప్పుడు దిగిన ఫోటో నెట్టింట వైరల్ గా మారుతుంది. ఈ పిక్ చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ తో ఫోటోను మరింత వైరల్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఆ బుడ్డోడు రోషన్ ఆ. అసలు గుర్తుపట్టలేకుండా ఉన్నాడే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.