ఈ పై ఫోటోలో కనిపిస్తున్న డాక్టర్‌ను గుర్తుపట్టారా.. ఆమె ఓ స్టార్ హీరోయిన్. అంతేకాదు డాక్టర్ కూడా. సింగర్‌గాను తన సత్తా చాటుకుంది. ఇక ఈ అమ్మడి తండ్రి సౌత్‌లోనే టాప్ స్టార్ డైరెక్టర్లలో ఒకరు. పాన్ ఇండియా సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఆయన వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ కూడా తన నటనతో ఇండస్ట్రీలో తండ్రికి తగ్గ కూతురుగా స్టార్ హీరోయిన్ ఇమేజ్ సంపాదించుకుంది.
ఇంతకీ ఈ సౌత్ స్టార్ హీరోయిన్ ఎవరు గుర్తుపట్టారా.. తనే టాలెంటెడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్. 1993 జూన్ 19న చెన్నైలో పుట్టిన ఈ ముద్దుగుమ్మ.. తన డాక్టర్ చదవు పూర్తి చేసిన తర్వాత నటనపై ఉన్న ఇంట్రెస్ట్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. కోలీవుడ్ హీరో కార్తీ సరసన వీరుమాన్‌తో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన.
అదితి మొదటి సినిమాతోనే నటిగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా తర్వత అమ్మడికి వరుస ఆఫర్లుక్యూ కట్టాయి. ఇందులో భాగంగానే శివ కార్తికేయన్.. మూవీరన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఇక ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో అమ్మడికి మంచి బ్రేక్ దొరికింది. అంతేకాదు సినిమాతోనే సింగర్ గాను తన సత్తా చాటుకుంది. అలా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టకముందే ఎంబిబిఎస్ పూర్తి చేసిన అదితి.. ఓ పక్కన డాక్టర్గా సేవలు అందిస్తూనే.. మరో పక్కన సినిమాల్లోనూ, సోషల్ మీడియాలోను సందడి చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ రోజురోజుకి పెంచుకుంటుంది.