సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ కు అడియన్స్‌లో ఉన్న ఫ్యాన్ పాలెం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ప్రేక్షకుల్లోనే కాదు సినీ సెలబ్రిటీస్ లోను ఎంతోమంది అయనను బాగా అభిమానిస్తూ ఉంటారు. అలాగే ఓ స్టార్ హీరోయిన్ కూడా రజినీకాంత్‌కు డై హార్ట్ ఫ్యాన్. మంచి స్నేహితురాలు కూడా. రజనీకాంత్‌తో ఎన్నో సినిమాల్లో కలిసి నటించిన ఈ ముద్దుగుమ్మ.. ఏకంగా ఆయనపై అభిమానంతో ఆయన అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన క్రమంలో ఆరోగ్యం మెరుగుపడాలని ఏకంగా వారం రోజులు ఉపవాసం ఉందట.
ఇంతకీ ఆమె ఎవరో కాదు.. దివంగత అతిలోకసుందరి శ్రీదేవి. గతంలో దీనికి సంబంధించిన న్యూస్ నెటింట వైరల్‌గా మారింది. 2011లో రజనీకాంత్ తీవ్ర అస్వస్థతకు గురవడంతో.. సింగపూర్‌లోని ఓ హాస్పటల్లో జాయిన్ చేశారు. ఈ క్రమంలో రజనీకాంత్ కోలుకోవాలని శ్రీదేవి.. దేవుని ముక్కుకొని ఏకంగా వారం రోజులపాటు ఆహారం ముట్టకుండా ఉపవాసం చేసిందట.
రజనీకాంత్ కోల్కున్న తర్వాత పూణేలో బాబా ఆలయాన్ని దర్శించి ఉపవాసాన్ని విరమిచ్చుకుందని సమాచారం. ఇక ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా వీళ్లిద్దరి కాంపౌండ్ 18 సినిమాలు తెరకెక్కయి. ఈ నేపధ్యంలోనే రజనీకాంత్ ఆరోగ్యం కోసం ఉపవాసం చేసి మరీ ఆయనను కాపాడింది శ్రీదేవి అంటూ అప్పట్లో తెగ వార్తలు వినిపించాయి. కానీ అలాంటి శ్రీదేవి 2017లో సింగపూర్‌లోని స్టార్ హోటల్ ఎవరు ఊహించని విధంగా ప్రమాదానికి గురై మరణించింది. బాత్రూంలో కాలుజారి పడి తుదిశ్వాస విడిచింది. ఈ న్యూ స్ ఇండస్ట్రీని శోకసంద్రంలో ముంచేసింది.