ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ప్రస్తుతం బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ మూవీకి సుకుమార్ దర్శకుడుగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా స్పెషల్ సాంగ్ ఒకటే బ్యాలెన్స్ ఉందని సమాచారం. ఎప్పటికీ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా సగం వరకు పూర్తి చేసిన మేకర్స్.. డిసెంబర్ 5న సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో ఆరు భాషలో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక పుష్ప టాలీవుడ్ కంటే బాలీవుడ్ లోనే ఎక్కువ సక్సెస్ సాధించింది. ఈ క్రమంలో ఇప్పటికే నార్త్‌లో పుష్ప భారీ బిజినెస్ జరుపుకున్నట్లు సమాచారం.
బాహుబలి 2 హిందీలో రూ.500 కోట్లు కొల్లగొట్టగా.. పుష్ప 2 సినిమాకు రూ.1000 కోట్లు వ్యాపారం జరుగుతుందని మేకర్స్ భావిస్తున్నారు. పుష్ప 2 కూడా హిందీలో భారీ కలెక్షన్లు రాబట్టేలా మాస్టర్ ప్లాన్ వేసినట్లు సమాచారం. ఇక పుష్ప ముందువరకు రూ.40 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న బన్నీ ఈ సినిమా తర్వాత ఒక్కసారిగా రెమ్యూనరేషన్ పెంచేశారు. రూ.150 నుంచి రూ.200 కోట్ల మధ్యలో రెమ్యూనరేషన్ బన్నీ చార్జ్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఒక్కోసారి సినిమా లాభాల్లో వాట కూడా తీసుకుంటున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక కుదిరిన ఒప్పందం ప్రకారం రూ.300 కోట్ల వస్తాయని పుష్ప 2పై అంచనాలు భారీగా ఉండడంతో బాహుబలి 2 కలెక్షన్ల దగ్గరకు లేదంటే.. వాటికంటే మించిపోయి అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక పుష్పా 2 ఈ రికార్డును అధిగమిస్తే.. ప్రభాస్ తర్వాత పాన్ ఇండియన్ హీరోగా అల్లు అర్జున్ ముద్ర వేసుకుంటాడు. ఈ క్రమంలోనే ఇతర భాషల కన్నా నార్త్ లోనే ప్రభాస్ కలెక్షన్లను మించి అల్లు అర్జున్ సక్సెస్ సాధించేలా మంచి ప్రణాళికతో బన్నీ ఉన్నాడని.. ఇందులో భాగంగానే ఓ రోజు ముందుకు సినిమా రిలీజ్ చేసినట్లు తెలుస్తుంది. ఇదే జరిగి కలెక్షన్లు భారీగా దక్కించుకుంటే తెలుగు సినిమాలతో పాన్ ఇండియా, బాలీవుడ్ పై తెలుగు స్టార్ హీరోల హవా మరింతగా పెరుగుతుంది.