టాలీవుడ్ సీనియర్ స్టార్ విక్టరీ వెంకటేష్‌కు తెలుగు ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో వైవిద్యమైన కథలతో రకరకాల పాత్రల్లో ప్రేక్షకులను ఆకట్టుకున్న వెంకటేష్‌కు ఫ్యామిలీ ఆడియన్స్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఎంతో మంది స్టార్ హీరోయిన్లతో ఆడి పాడిన వెంకీ మామ.. మల్టీ స్టారర్ సినిమాలోను నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటికే ఎంతో మంది స్టార్ హీరోలతో మల్టీ స్టార్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే రానాతో కలిసి రానా నాయుడు వెబ్ సిరీస్‌ను నటించాడు. ఇక ఈ సిరీస్‌తో డిజిటల్ వరల్డ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు.
ఇక ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ వరుస సినిమాలో నటిస్తున్న వెంకీ మామ.. ఓల్డ్ ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది. అయితే ఈ పై ఫోటోలో వెంకటేష్ తో పాటు ఉన్న విరిలో ఓ స్టార్ హీరో.. అలాగే పాపులర్ డైరెక్టర్ కూడా ఉన్నారు. వెంకటేష్ నటించిన ఒకప్పటి సినిమా షూట్ లో దిగిన ఫోటో ఇది. ఈ ఫోటోల వెంకటేష్ కాకుండా ఉన్న ఆ స్టార్ హీరో, డైరెక్టర్ ఎవరు మీరు గెస్ చేశారా.. అది కాస్త కష్టం లెండి. ఇప్పటికీ, అప్పటికీ అసలు పోలికే లేనంతగా ఆ ఇద్దరు సెలబ్రిటీస్ మారిపోయారు.
ఇంతకీ ఆ సెలెబ్రెటీస్ ఎవరంటే.. వారిలో ఒకరు స్టార్ హీరో రామ్ పోతినేని, మరొకరు టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. ఇప్పుడు వీరిద్దరూ టాలీవుడ్ లో క్రేజ్ సెలబ్రిటీస్‌గా దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో ఈ థ్రో బ్యాక్ ఫోటో నెటింట తెగ వైరల్‌గా మారింది. రామ్‌తో కలిసి వెంకటేష్ మసాలా మూవీ నటించిన సంగతి తెలిసిందే. అలాగే వెంకటేష్ నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి సినిమాలకు త్రివిక్రమ్ మాటలు అందించారు. ఈ సినిమాలు మంచి సక్సెస్ అందుకున్నాయి.