స్టార్ డైరెక్టర్‌కి ఫైన్ వేసిన సీనియ‌ర్ ఎన్టీఆర్‌… ఆ రోజు ఏం జ‌రిగింది..!

నందమూరి నట‌సార్వ‌భౌమ తారక రామారావు గారు న‌ట విశ్వ‌రూపం, అయ‌న డిసిప్లెయిన్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అలాంటి అన్న‌గారు మొట్టమొదటిసారిగా రావణ‌పాత్ర న‌టించిన మూవీ భూకైలాస్. ఇందులో నారదుడి పాత్రను అక్కినేని నాగేశ్వరరావు పోషించారు. భూకైలాస్ సినిమాలో వీరిద్దరి కాంబినేషన్లో ఎన్నో సన్నివేశాలు అప్పట్లో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా షూట్ టైంలో సెట్ లో ఒకరి కంటే మరొకరు ముందుండాలనే ఉద్దేశంతో అందరికంటే ముందు ఇద్దరు హీరోలే సెట్లో ఉండేవారట. దీంతో యూనిట్ సభ్యులు అలర్ట్గా ఉండేవారు. సినిమాల్లో కీరోలు పోషించిన జమున కూడా సాధ్యమైనంత త్వరగా సెట్ కి వచ్చేసేదట.

ఈ క్రమంలోనే సూర్యోదయం సన్నివేశం ఒకటుందని అందులో ఎన్టీఆర్, ఏఎన్నార్ చేయాల‌ని సినిమా దర్శకుడు కే. శంకర్ ముందు రోజు సాయంత్రం వీరిద్దరి దగ్గరికి వెళ్లి రేపు ఉదయం సూర్యోదయ సన్నివేశాన్ని బీచ్ లో షూట్ చేయాలని ప్లాన్ చేసాం.. మీరిద్దరూ ఉదయం ఐదు గంటలకల్లా స్పాట్ లో ఉంటే.. ఒక గంటన్నర టైంలో షార్ట్ ని తీసేయొచ్చు అని వివరించారట. దీంతో హీరోలు ఇద్దరు రోజు లేచే సమయాన్ని కంటే మరింత ముందే లేచి మేకప్‌తో సహా సిద్దమై ఐదు గంటలకల్లా బీచ్ వద్దకు వెళ్ళిపోయారు. అది చెన్నై బీచ్. కానీ ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే షూటింగ్ కు సంబంధించిన వాళ్ళు ఎవ్వరూ అప్ప‌టికి అక్క‌డ‌కు రాలేదట. పొరపాటున వేరే ప్రదేశానికి వచ్చామని హీరోలు ఇద్దరు మొదటి సందేహ పడిన తమకు చెప్పిన ప్రదేశం అదే అని ఫిక్స్ అయ్యారు.

సరే వస్తారు కదా అని బీచ్ లో ఇసుక మీద కూర్చుని కాసేపు కబుర్లు కూడా చెప్పుకున్నారట. ఉదయం ఆరు దాటినా యూనిట్ సభ్యులు అక్కడికి రాలేదు. ఎక్కడో తేడా జరిగి ఉంటుందని ఇంటికి వెళ్లడానికి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ సిద్ధమయ్యేసరికి డైరెక్టర్ శంకర్ అక్కడికి వెళ్లి మేకప్‌తో సిద్ధంగా ఉన్న ఎన్టీఆర్, ఏఎన్ఆర్లను చూసి గజగజ ఒణికిపోయాడట. కారులోంచి ఒక్కసారిగా కిందకు దూకేసి వాళ్ళ కాళ్ళ మీద పడి పొరపాటు అయిపోయింది క్షమించమని రిక్వెస్ట్ చేశాడట. అక్కినేని ఊరుకున్న.. ఎన్టీఆర్ మాత్రం కోపంతో ఊగిపోయారట. మొత్తం షూటింగ్ అయితే జరిగింది. కానీ ఎన్టీఆర్ ఆ త‌ప్పుకు డైరెక్ట‌క‌ర్‌కు రూ.5 వేలు ఫైన్ వేశారట. అప్పట్లో ఈ న్యూస్ చ‌ర్చ‌నీయంశంగా మారింది.