ఈ ఫోటోలో పాపను గుర్తుపట్టారా.. చేసిన సినిమాలన్నీ ప్లాప్.. కానీ పిక్స్ లెవెల్ లో క్రేజ్..?

సినీ ఇండస్ట్రీలో ప్రతి ఏడాది ఎంతో మంది స్టార్ హీరోయిన్గా ఎదగాలని ఆశతో అడుగుపెడుతూ ఉంటారు. కొంతమంది అవకాశాలను దక్కించుకొని తమ అందం, అభినయంతో సూపర్ హిట్ అందుకోవడమే కాదు లక్షలాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకుంటూ ఉంటారు. అయితే మరి కొంతమంది మాత్రం అందం, అభినయం ఉన్నా సరేనా లక్ లేకపోవడంతో ఇండస్ట్రీలో అవకాశాలు లేక.. సరైన హిట్ అందక సతమతమవుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇతర ఇండస్ట్రీలోకు చెక్కేసి అక్కడ అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. కొంతమంది మాత్రం ఇక్కడే సెకండ్ హీరోయిన్స్ గాను నటిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతారు.

ఇక ఈ పై ఫోటోలో కనిపిస్తున్న చిన్నది కూడా అదే కోవకు చెందుతుంది. అందంతో పాటు టాలెంట్ ఉన్న అవకాశాలు మాత్రం దక్కించుకోలేకపోతున్న ఈ ముద్దుగుమ్మ.. కుర్రాళ్లకు మాత్రం మోస్ట్ ఫేవరెట్. తన అందచందాలతో యూత్ ను మత్తెక్కించే ఈ అమ్మ‌డి ఇప్పటికే పలు సినిమాల్లో నటించిన ఒక్క సినిమా కూడా సక్సెస్ అందలేదు. చేసిన సినిమాలన్నీ ప్లాప్ అయినా అమ్మడి క్రేజ్ మాత్రం కాస్త కూడా తగ్గలేదు. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో గ్లామర్ షో తో ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. కుర్రాళ్లకు మత్తెక్కిస్తూ చెమటలు పట్టిస్తుంది. ఇంతకీ హీరోయిన్ ఎవరో చెప్పలేదు కదా తనే కేతిక శర్మ.

2021లో రిలీజ్ అయినా రొమాంటిక్ సినిమాతో హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. ఆకాష్‌పురి హీరోగా వ‌చ్చిన ఈ మూవీ సక్సెస్ అందుకోలేదు. తర్వాత లక్ష్య‌ మూవీలో అవకాశాన్ని దక్కించుకుంది. కానీ ఈ సినిమా కూడా ప్లాప్ గా నిలిచింది. దీని తర్వాత మరోసారి అమ్మడికి వైష్ణవ్‌ తేజ్ రంగ రంగ వైభవంగా సినిమాలో ఛాన్స్ వచ్చింది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన బ్రో సినిమాలోను అవ‌కాశాన్ని దక్కించుకొని నటించింది. కానీ ఈ సినిమా కూడా సక్సెస్ కాలేదు. ఇలా వరుస ఫ్లాప్స్‌ ఎదురవడంతో అమ్మడికి సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. ఈ క్రమంలో ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ట్రీట్ తో కుర్రాళ్లను కవ్విస్తుంది. తన ఎద అందాలతో కుర్రాళ్లకు మత్తెక్కిస్తోంది.