తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోల నుంచి ప్రొడ్యూసర్ల వరకు సెంటిమెంట్లను ఎక్కువగా ఫాలో అవుతుంటారు. వాటికి అనుకూలంగానే సినిమాలను చేసి రిలీజ్ చేస్తూ ఉంటారు. అలాగే రాజమౌళి నుంచి కూడా ఓ సెంటిమెంట్ ఎప్పటి నుంచి అన్వాయితీగా వస్తుంది. ఆయనతో సినిమా చేసిన తర్వాత.. ఆ హీరోల నెక్స్ట్ సినిమాలు డిజాస్టర్లు అవుతూ వస్తున్నాయి. రాజమౌళి మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ 1 నుంచి ఆ అనవాయితి కొనసాగుతూనే ఉంది. అయితే ఇటీవల రాజమౌళి బ్యాడ్ సెంటిమెంట్‌ను ఎన్టీఆర్ బ్రేక్ చేశాడు. త్రిబుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వచ్చిన దేవర సూపర్ హిట్ టాక్ తో కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇప్పుడు ఎన్టీఆర్, రాజమౌళి సెంటిమెంట్ ను బ్రేక్ చేశాడని ఆనందంలో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
అయితే తారక్ స్టూడెంట్ నెంబర్ వన్ తర్వాత సుబ్బు, సింహాద్రి, ఆంధ్రావాల.. ప్రభాస్ కి ఛత్రపతి తర్వాత పౌర్ణమి, బాహుబలి తర్వాత సాహో, రాదే శ్యాం, చరణ్ కి మగధీర తర్వాత ఆరెంజ్, ఆర్ఆర్ తర్వాత ఆచార్య ఇలా డిజాస్టర్లు ఎదురయ్యాయి. వీరంతా రాజమౌళి బ్యాడ్ సెంటిమెంట్‌ను చూసినవాళ్లే. కానీ.. ఓ స్టార్ హీరో కెరీర్ మాత్రం రాజమౌళి సెంటిమెంట్‌తో సినీ ఇండస్ట్రీ నుంచి బయటికి వెళ్లిపోయే పరిస్థితి తెచ్చి పెట్టిందట. జక్కన్న సినిమా తర్వాత ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 12 కు పైగా డిజాస్టర్లు ఎదురు కావడంతో ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోవాలని ఆ హీరో భావించాడట. ఇంతకీ ఆ హీరో ఎవరో ఒకసారి తెలుసుకుందాం. అతను ఎవరో కాదు యంగ్ హీరో నితిన్. రాజమౌళి కాంబోలో తెరకెక్కిన సై సినిమా 2004లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే.
అప్పట్లో యూత్‌ని విపరీతంగా ఆకట్టుకున్న ఈ సినిమా రక్బి గేమ్ నేపథ్యంలో తెరకెక్కింది. అయితే నితిన్ సై సినిమా తర్వాత దాదాపు 8 సంవత్సరాల పాటు ఒక హిట్ కూడా పడలేదు. దీంతో కనక టైం లో నిజం ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసి వెళ్లిపోదామని భావించాడట. చివరి ప్రయత్నంగా విక్రమ్ కుమార్ డైరెక్షన్లో ఇష్క్ సినిమాలో నటించాడు. 2012లో రిలీజ్ అయిన సినిమా సూపర్ హిట్ అయింది. నితిన్ కెరీర్లో మళ్ళీ ఆశలు చిగురించాయి. ఇష్క్ తర్వాత మంచి సక్సెస్ లో అందుకుంటూ నితిన్ మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. అయితే రాజమౌళి సినిమా హిట్ అయిన తర్వాత 12 సినిమాలు ఫ్లాప్ అవడంతో నితిన్ మెంటల్ టార్చర్ తో ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోవాలనుకున్నాడట. ఇక ప్రస్తుతం నితిన్.. వేణు శ్రీరామ్ డైరెక్షన్లో తమ్ముడు మూవీ తో పాటు.. వెంకి కుడుమల డైరెక్షన్లో రాబిన్‌హుడ్ సినిమాను నటిస్తు బిజీగా గడుపుతున్నాడు.