రజనీకాంత్ తన కెరీర్లో ఇన్ని బ్లాక్ బస్టర్లు రిజెక్ట్ చేశాడా.. లిస్ట్ ఇదే..?

స్టార్ హీరో రజ‌నీకాంత్ ప్రస్తుతం కోలీవుడ్ టాప్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తెలుగులోనూ మంచి ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్న రజినీకాంత్.. కోలీవుడ్లో త‌లైవర్‌, సూపర్ స్టార్ గా రాణిస్తున్నాడు. అయితే ఎన్నో హిట్ సినిమాలతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న రజినీకాంత్ ప్ర‌స‌తుతం వెట్ట‌యాన్‌తో ఆడియ‌న్స్‌ను ప‌ల‌క‌రించ‌నున్నాడు. ఈ సినిమా అక్టోబ‌ర్ 10న గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ కానుంది. కాగా ర‌జ‌నీ తన కెరీర్‌లో ప‌లు బ్లాక్ బస్టర్ సినిమాలను కూడా రిజెక్ట్ చేశాడట. ఇంతకీ ఆ సినిమాల లిస్టు ఏంటో ఒకసారి చూద్దాం.

Papanasam (2015) - Movie | Reviews, Cast & Release Date - BookMyShow

పాపనాశం:
కమలహాసన్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న పాపనాశం సినిమాలో మొదట రజనీకాంత్ హీరోగా అనుకున్నారట. అయితే ఎవో కారణాలతో రజిని ఈ సినిమాను రిజెక్ట్ చేశాడు.

Mudhalvan - Wikipedia

ముదల్వన్
అర్జున్ సర్జ హీరోగా నటించి మంచి సక్సెస్ అందుకున్న మూవీ ముదల్వన్.. ప్రేక్షకులను ఈ సినిమా విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాలో మొదట రజనీకాంత్‌ను మేకర్స్ సంప్రదించారట. కానీ.. రజినీకాంత్ మాత్రం కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో సినిమాలో కూడా నేను సియం గా నటించన‌ని.. ముదల్వన్ సినిమాను రజనీకాంత్ వదులుకున్నారు.

இந்தியன் (1996 திரைப்படம்) - தமிழ் விக்கிப்பீடியா

ఇండియన్
ఇక టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ ద‌ర్శ‌క‌త్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న భారతీయుడు సినిమాలో కూడా మొదట రజనీకాంత్‌ను భావించారట. అయితే కారణాలు తెలియవు కానీ.. రజనీకాంత్ భారతీయుడు సినిమాలో నటించేందుకు నిరాకరించారు.

Annan Blockbuster Tamil Movie || Ramarajan , Swathi , Manivannan R  Sundarrajan || Full HD

అన్నన్
చియాన్‌ విక్రమ్ హీరోగా తెరకెక్కిన అన్యన్‌ తెలుగులోను అపరిచితుడు పేరుతో డబ్ అయినా సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇక్కడ కూడా మంచి సక్సెస్ అందుకుంది. ఇక ఈ సినిమాకు కూడా శంకర్ దర్శకత్వం వహించారు. మొదట శంకర్ ఈ కథను రజినీకాంత్‌ను మైండ్ లో పెట్టుకొని రాశారట. కానీ దీనికి కూడా రజనీకాంత్ నో చెప్పాడు.

Saamy (2003) - IMDb

సామి:
చియాన్ విక్రమ్ హీరోగా, త్రిష హీరోయిన్ గా నటించిన మరో తమిళ్ మూవీ సామి. ఈ కథ కూడా మొదట రజనీకాంత్ కు వినిపించారట. కానీ.. రజిని ఏవో ఒక కారణాలతో సినిమా రిజెక్ట్ చేశాడు.

సర్కార్ (2018 సినిమా) - వికీపీడియా

సర్కార్:
ఇక ఇటీవల కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి హీరోగా తెర‌కెక్కి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న మూవీ సర్కార్. పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌తో ఈ సినిమా తెరకెక్కింది. అయితే మొదట ఈ సినిమాకు రజినీకాంత్‌ను పెట్టుకోవాలని మేకర్స్ భావించారట. కానీ.. ఇది రాజకీయ కథాంశం కావడంతో సర్కార్ సినిమాను రజనీకాంత్ వదులుకున్నాడు.