దివంగత స్టార్ హీరోయిన్ సౌందర్యకు టాలీవుడ్లో ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహానటి సావిత్రి తర్వాత అంతటి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సౌందర్య.. దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించి మెప్పించింది. డీ గ్లామరస్ పాత్రలను ఎంచుకుంటూ ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరైన సౌందర్య.. లక్షలాదిమంది హృదయాల్లో ఎప్పటికి చెరగని ముద్ర వేసుకుంది. అలాంటి స్టార్ హీరోయిన్ సౌందర్య తో.. ఓ సూపర్ హిట్ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చిన పవన్ కళ్యాణ్ ఆ అవకాశాన్ని రిజెక్ట్ చేశాడంటూ న్యూస్ వైరల్ అవుతుంది. ఇంతకీ పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసిన ఆ సినిమా ఏంటో.. అసలు సౌందర్యను రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటో ఒకసారి తెలుసుకుందాం.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ ప్రారంభంలో మెగాస్టార్ తమ్ముడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్గా ఎదుగుతున్న క్రమంలో పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలలో సుస్వాగతం ఒకటి. పవన్ కళ్యాణ్ సినీ కెరీర్లో మూడో సినిమాగా తెరకెక్కిన ఈ మూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. భీమినేని శ్రీనివాసరావు డైరెక్టర్‌గా తెరకెక్కిన ఈ ఎమోషనల్ డ్రామా క్లైమాక్స్ ను ఎప్పటికి మర్చిపోలేరు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ జంటగా హీరోయిన్ దేవయాని నటించిన సంగతి తెలిసిందే. అయితే మొదట ఈ సినిమాకు హీరోయిన్గా సౌందర్యం తీసుకోవాలని భీమినేని భావించారట.
పవన్ కళ్యాణ్ మాత్రం ససేమీరా సౌందర్య తో నటించనని రిజెక్ట్ చేశాడట. అంత గొప్ప నటితో నటించే ధైర్యం నాకు లేదు. ఆమె పక్కన నటిస్తే నా నటన తేలిపోతుంది. ఆమెకు బదులు వేరే హీరోయిన్ను పెట్టి సినిమాను తీస్తానంటే నేను నటిస్తా.. లేదంటే ఈ సినిమాల్లో మరొకరిని చూసుకోమని శ్రీనివాసరావుకు తెగేసి చెప్పాడట. ఇక మొదట ఎలాగైనా సౌందర్యతో ఈ సినిమా చేయించాలని భీమినేని ఎంత ప్రయత్నించినా పవన్ మాత్రం నో చెప్పేయడంతో తప్పక ఈ సినిమాలో దేవయానిని హీరోయిన్గా తీసుకోవాల్సి వచ్చింది. దేవయాని అప్పట్లో తమిళ్ స్టార్ హీరోయిన్గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. ఈ క్రమంలోనే టాలీవుడ్లో పవన్ సరసన దేవయానిని తీసుకువచ్చి నటింపజేశారు. ఇక ఈ సినిమా తెరకెక్కి ఫుల్‌రన్‌లో ఏకంగా రూ.5కోట్లకు పైగా షేర్ రాబట్టడం విశేషం. అంటే అప్పట్లోనే ఈ సినిమా ప్రేక్షకులను ఏ రేంజ్లో ఆకట్టుకుందో అర్థం చేసుకోవచ్చు.