సౌత్ స్టార్ బ్యూటీ సమంత ప్రస్తుతం సెటాడెల్ రీమేక్ హనీ బన్నీ వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో సందడి చేస్తుంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఈ ప్రమోషన్స్ కోసం పలు ఇంటర్వ్యూలో పాల్గొని తన సమాధానాలతో ఆకట్టుకుంటుంది. నవంబర్ 7వ తేదీన అమెజాన్ ప్రైమ్ లో ఈ వెబ్‌సిరీస్ ప్రారంభం కానుంది. సమంతతో పాటు దర్శకులు రాజ్ అండ్ డికే కూడా ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేస్తున్నారు. షూటింగ్ టైంలో సమంత పడిన కష్టాన్ని వాళ్లు వెల్లడించారు. సిరీస్ కచ్చితంగా బ్లాక్ బస్టర్ సక్సెస్ అవుతుందని నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు మేకర్స్.
ఇక ఈ సిరీస్‌లో వరుణ్ ధావన్ హీరోగా నటించాడు. ఈ ఇంటర్వ్యూలో విలేకరుల నుంచి ఎదురవుతున్న ప్రశ్నలకు ఓపికగా చాలా తెలివిగా సమాధానాలు చెప్తుంది సమంత. ఈ క్రమంలోనే సమంత రెండో పెళ్లిపై ఆమెకు ప్రశ్న ఎదురైంది. దీనితో సమంత రియాక్ట్ అవుతూ.. ఎంతో ఇష్టపడి ప్రేమించి, వివాహం చేసుకున్న. ఆ వ్యక్తితో ఇప్పుడు విడిపోయాను. ఇక నా జీవితంలో రెండో పెళ్లి అనే ప్రసక్తే లేదు. మరో వ్యక్తి ఎవరు ఉండరు అంటూ ముక్కుసూటి సమాధానం చెప్పుకొచ్చింది.
దీంతో అందరూ సమంతకు ఫీదా అవుతున్నారు. అంతగా చైతన్యను ప్రేమించింది. కనుక ఇప్పటికీ మర్చిపోలేకపోతుందని కామెంట్స్ చేస్తున్నారు. నాగచైతన్యతో కంపేర్ చేస్తూ.. విడాకులైన కొన్నేళ్లకే శోభితతో డేటింగ్ మొదలుపెట్టి పెళ్లికి సిద్ధమైపోయాడు. సమంత మాత్రం ఇప్పటికే తన ప్రేమను మర్చిపోలేక మరో వ్యక్తిని జీవితంలోకి తీసుకురావడం ఇష్టంలేక అలానే ఉంటానని చెప్పేసింది. ఇప్పటికీ మానసికంగా దిగులు పడుతూనే ఉందన్న విషయం తన కామెంట్స్ తో అర్థమవుతుందంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.