ఎన్టీఆర్ జ్వరం వస్తే అలా చేసేవారా.. కోడికి ఉప్పు, కారం దట్టించి దుప్పటి కప్పుకొని.. !

టాలీవుడ్ దిగ్గజ నటుడు నందమూరి నట‌సార్వ‌భౌమ‌ ఎన్టీఆర్‌కు తెలుగు ప్రజలలో ఎలాంటి గౌరవం, అభిమానం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ పక్కన నటుడు గానే కాదు.. రాజకీయాల్లోనూ మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఎన్టీఆర్.. లక్షలాది మంది హృదయాల్లో ఎప్పటికీ చెరగని ముద్ర వేసుకున్నారు. ఇప్పటికి ఆయనను చాలామంది ఆరాధ్య దైవంగా కొలుస్తున్నారంటే అప్పట్లో ఆయన చేసిన సేవలు ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు. ఇక ఒక నటుడిగాను వెండితెరపై రాముడు, కృష్ణుడి వేషాల్లో ఆయనను టచ్ చేసేవారు లేరు అనడంలో సందేహం లేదు. నటుడిగా రాజకీయ పరంగానే కాదు, ఫిజిక‌ల్‌గాను ఆయన ఆజానుబావుడిలా మెరిసేవాడు. అప్ప‌ట్లో ఫ్యాన్స్‌ను తన లుక్ తోనే ఆకట్టుకునేవారు.

article_image2

ప్రస్తుతం భౌతికంగా ఆయన మన మధ్య లేకున్నా.. ఎంతో మంది జ్ఞాపకాల్లో ఎప్పటికీ ఆయన జీవించే ఉన్నారు. ఇక రామారావు గారు బ్రతికున్నంత కాలం తన ఆరోగ్యం విషయంలో ఎంతో శ్రద్ధగా ఉండేవారట. ఫుడ్ విషయంలో మాత్రం అస్సలు తగ్గేవారు కాద‌ని.. ఎంత బాగా తింటారో అంతే కష్టం కూడా చేసేవారిని.. అప్పట్లో వర్కౌట్, జీమ్స్‌ ఇలాంటివి ఏమీ లేవు కనుక ఇంట్లోనే మూడు గంటలకు లేచి ఎక్ససైజ్ చేసేవార‌ని.. ఇంటి దగ్గర ఉన్న ఇసుక కుప్పను ఇటు నుంచి అటు.. అటు నుంచి ఇటు.. ఎత్తిపోస్తూ ఉండేవాడని అదే ఆయన ఎక్సర్సైజ్ అని.. ఆయనకు అనారోగ్య సమస్యలు కూడా ఉండేది కాదని.. చాలా హెల్తీగా ఉండే వారిని సమాచారం. అయితే జ్వరం వచ్చిన ఆయన మెడిసిన్ వాడే వాడు కాదట‌. బాలకృష్ణ తాజా ఆన్ స్టాపబుల్ సీజన్ 4 ఫస్ట్ ఎపిసోడ్ లో స్వ‌యంగా చెప్పుకొచ్చాడు.

ప్రతిరోజు లేవగానే ఒక ఫుల్ కోడిని తినేయడం నాన్న‌కు అలవాటని.. అదే ఆయన హెల్త్ సీక్రెట్ అంటూ బాలయ్య చెప్పుకొచ్చాడు. ఇక దీనిపై గెస్ట్ గా వచ్చిన చంద్రబాబు రియాక్ట్ అవుతూ.. 60 ఏళ్ళు వచ్చిన ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా అలా ఉన్నారంటే ఆయన తిన్న ఫుడ్, క్రమశిక్షణనే కారణం అంటూ సీఎం చంద్రబాబు కామెంట్స్ చేశాడు. ఈ క్రమంలో బాలయ్య మాట్లాడుతూ మరో రహస్యాన్ని వివరించాడు.

Unstoppable Season 4 Episode 1 Fun Promo | Nandamuri Balakrishna | N.  Chandrababu Naidu - YouTube

జ్వరం వస్తే ఆయన ఎప్పుడూ మందుల పనే ఉండేది కాదని.. ఒక కోడి మొత్తం ఉప్పు, కారం గట్టిగా దట్టించుకుని గాటుగా ఉండేలా చేసుకుని నోటికి రుచించేలా తినేవారని.. మెడిసినే లేకుండా మొత్తం దుప్పటి కప్పేసుకుని పడుకునే వారిని.. ఫ్యాన్ కూడా వేసుకునేవారు కాదంటూ చెప్పుకొచ్చాడు. ఆ వేడికి ఉదయం లేచేసరికి దుప్పటి మొత్తం తడిచిపోయి జ్వరం మాయం అయ్యేది అంటూ బాలకృష్ణ వెల్లడించాడు. తనకు ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు అక్క లోకేశ్వరి.. నువ్వు అలాగే చేయమని నాకు చెబుతూ ఉంటుందని.. అది నా వల్ల కాదు అంటూ బాలయ్య వెల్లడించారు. ప్రస్తుతం బాలయ్య చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.