అందరినీ వణికించే బాలయ్యనే భయపెట్టిన‌ ఏకైక వ్యక్తి ఎవరో తెలుసా.. ఎందుకంత భయం అంటే..?

సినీ ఇండస్ట్రీలో స్టార్ కిడ్‌గా అడుగుపెడుతున్నారంటే.. వారి సినిమాల‌పై అభిమానుల్లో ఎలాంటి అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా అవకాశం త్వరగానే వచ్చినా.. అభిమానులను ఆకట్టుకొని ఆ స్టార్‌డం నిలబెట్టుకోవడానికి ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. అలా శ్ర‌మించి స‌క్స‌స్ అందుకున్న వారిలో వాల‌య్య ఒక‌రు. ఎన్టీఆర్ న‌ట వార‌సుడిగా ఇండ‌స్ట్రీలోవి అడుగుపెట్టిన బాల‌య్య ప్రస్తుతం నటుడిగానే కాదు.. రాజకీయాల్లోనూ రాణిస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం హ్యాట్రిక్స్ సక్సెస్‌లతో మంచి ఫామ్‌లో ఉన్న బాలయ్య.. బాబి డైరెక్షన్లో తన 109వ‌ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Top Hero - Wikipedia

ఈ సినిమా తర్వాత తాను నటించబోయే సినిమాల లైనప్‌ కూడా చాలా పెద్దగానే ఉంది. ఈ క్రమంలోనే బాలయ్యకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ నెటింట‌ వైరల్‌గా మారుతుంది. బాలకృష్ణ భోళా మనిషి అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఉన్న‌ది ఉన్న‌ట్లుగా మాట్లాడే స్వ‌భావం. ఈ క్రమంలోనే బాలయ్యకు కోపం ఎక్కువ అనే పేర‌రుకూడా వ‌చ్చింది. ఏ విషయం అయినా ముక్కుసూటిగా మాట్లాడే బాలయ్య.. ఎదుట ఎంత గొప్పవారు ఉన్నా.. వారు ఎంత పెద్ద స్టేజిలో ఉన్నా.. తప్పు చేస్తే బెదురు లేకుండా ఎదిరించి మాట్లాడతారు. త‌న కోపాన్ని చూపిస్తారు. అలాంటి బాలయ్యకు ఇండస్ట్రీలో పనిచేసే ఓ డైరెక్టర్ అంటే చాలా భయమట. ఇంతకీ అతను ఎవరో కాదు.. ఎస్వీ కృష్ణారెడ్డి. ఒకప్పుడు వ‌రుస సినిమాలతో మంచి సక్సెస్‌లు అందుకున్న కృష్ణారెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇక గతంలో బాలయ్య, ఎస్వీ కృష్ణరెడ్డి కాంబోలో ” టాప్ హీరో ” సినిమా తెరకెక్కింది. ఈ క్రమంలో వారి ఇద్దరి మధ్యన జరిగిన ఓ సంఘటన అప్పట్లో టాలీవుడ్ ని ఆశ్చర్యపరచిందట. సినిమా సెట్స్ లో బ్రేక్ రావడంతో బాలయ్య సెట్ సభ్యులతో కలిసి పేకాట ఆడుతూ ఉన్నాడ‌ట. అప్పుడు కృష్ణారెడ్డి అక్కడకు రావడంతో.. బాలకృష్ణ టక్కున లేచి భయంగా చేతులు కట్టుకుని సైలెంట్ గా నిలబడిపోయాడట. అయ్యో ఎందుకండి నిలబడడం.. కూర్చోండి అంటూ కృష్ణారెడ్డి చెప్పాడట. దానికి బాలయ్య రియాక్ట్ అవుతూ.. నన్ను క్షమించండి సార్. మీలాంటి గొప్ప డైరెక్టర్ ఎదురుగా పేకాడుతూ తప్పు చేశాను. అందుకే క్షమాపణ అడుగుతున్నా అంటూ వివరించాడట. ఇలా ఇండస్ట్రీలో అందరినీ భయపెట్టే బాలయ్య.. తాను ఏదైనా తప్పు చేసిన ఎదుటివారికి అంతే భయపడతాడ‌న‌టానికి ఇది బెస్ట్ ఉదాహరణ.