ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ మూవీ ముహూర్తం ఫిక్స్.. యాక్షన్ మొదలయ్యేది అప్పుడే..

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఇటీవల తెర‌కెక్కి దేవర బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవ‌డంతో మంచి ఫామ్ లో దూసుకుపోతన్నాడు. ఈ ఊపులోనే బాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్‌ మల్టీస్టారర్ వార్‌2 షూట్‌లో సందడి చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా స్కెడ్యూల్స్ లో బిజీగా గడుపుతున్న తారక్.. ఈ సినిమా లో హృతిక్ రోషన్ కు గట్టి పోటీ ఇవ్వ‌నున్నాడు. నెగిటివ్ స్టేడ్స్‌లో తార‌క్ కనిపించనున్నాడట. ఇక ఈ సినిమాలో ఓ స్పైగా ఆయ‌న కనిపించనున్నాడని బాలీవుడ్ నుంచి వార్తలు వైరల్ అవుతున్నాయి.

Jr NTR, Prashanth Neel's film launch date is here - India Today

ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత తార‌క్ – ప్ర‌శాంత్ నీల్‌తో మరో సినిమాలో నటించనున్న‌ సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా షూట్ కు ముహూర్తం ఫిక్స్ అయిందని.. ఒక క్రేజీ న్యూస్ నెటింట‌ వైరల్ గా మారుతుంది. ఇటీవల హైదరాబాద్ రామనాయుడు స్టూడియోస్ లో గప్చుప్ గా ఈ సినిమా పూజ కార్యక్రమాలు పూర్తయిపోయాయని.. అతి త‌క్క‌వ మంది స‌మ‌క్షంలో ఈ కార్య‌క్ర‌మాని ముగించార‌ని టాక్. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం నవంబర్ చివర్లో ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టనున్నారట మేకర్స్.

Jr NTR's movie with Prashanth Neel locks its release date

అందుకు తగ్గ ఏర్పాట్లలో ప్రశాంత్ నీల్‌ బిజీగా గడుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే.. తారక్ మాత్రం సంక్రాంతి తర్వాత షూట్ లో పాల్గొంటారని.. వార్ 2ను పూర్తి చేసి.. ప్రశాంత్ నీల్ సినిమా కోసం లుక్ మార్చుకోవడానికి కాస్త సమయం కేటాయించనున్నాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమా సెర్చ్ పైకి రాకముందే ప్రశాంత్‌ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. 2026 జనవరి 9న సంక్రాంతి బరిలో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్రశాంత్ నీల్‌ సన్నాహాలు చేస్తున్నాడు. మరి సినిమా అనుకున్న డేట్ కు షూట్ పూర్తి చేసుకుని రిలీజ్ అవుతుందో.. లేదో వేచి చూడాలి.