టాలీవుడ్ నెంబర్‌వన్ స్టార్ డైరెక్టర్ ఎవరు అనగానే మనకు టక్కున గుర్తుకు వచ్చేది రాజమౌళి. ఇప్పటివరకు సక్సెస్ రేట్ తప్ప.. ఫ్లాప్ తెలియని డైరెక్టర్‌గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈయన.. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో తన సత్తా చాటుకుంటున్నాడు. త్వరలోనే పాన్ వరల్డ్ రేంజ్ లో ఆడియన్స్ను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు. ఇలాంటి టాప్ డైరెక్టర్ తో సినిమా చేయాలని చిన్న సెలబ్రిటీస్ నుంచి పెద్ద పెద్ద స్టార్ హీరోల వరకు ప్రతి ఒక్కరు ఆశపడుతూ ఉంటారు.
అలాంటిది రాజమౌళితో సినిమా ఛాన్స్ వస్తే ఎవరు వదులుకుంటారు.. కానీ ఓ స్టార్ హీరో రాజమౌళి డైరెక్ట్ సినిమా ఆఫర్ చేసిన సరే ఆ సినిమాను రిజెక్ట్ చేసాడట. ఇంతకీ ఆయన ఎవరోకాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ సినిమాను పవన్ రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటో ఒకసారి చూద్దాం. రాజమౌళి ఇప్పటివరకు తన కెరీర్‌లో 12 సినిమాలు తెరకెక్కించగా.. 12 బ్లాక్ బాస్టర్లుగా నిలవడమే కాదు.. కలెక్షన్ల వర్షం కురిపించాయి. అలాంటి జక్కన్న తెరకెక్కించిన సై సినిమా ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకుందో తెలిసిందే. నితిన్, జెనీలియా జంటగా నటించిన ఈ సినిమా కాలేజ్ బ్యాక్ డ్రాప్‌తో రూపొందింది.
ఈ మూవీ అప్పట్లో రికార్డులు క్రియేట్ చేసింది. అప్పటివరకు చాలామంది తెలుగు ఆడియన్స్‌కు తెలియని రక్బి ఆటను.. రాజమౌళి సినిమాతో ఆడియన్స్‌కు పరిచయం చేశాడు. ఇందులో నితిన్ కంటే ముందు పవన్‌ని హీరోగా తీసుకోవాలని జక్కన భావించాడట. కానీ పవన్ కథ మొత్తం విన్న తర్వాత స్టోరీ చాలా డిఫరెంట్ గా ఉంది.. ఆ కథలో తనను యాక్సెప్ట్ చేస్తారో.. లేదో అనే ఉద్దేశంతో సినిమా రిజెక్ట్ చేశాడట. పవన్ నో చెప్పడంతో ఆ సినిమాలో నితిన్ ఛాన్స్ కొట్టేసాడు. అప్పటికే జయం, దిల్ లాంటి సినిమాలతో సక్సెస్ఫుల్ బాటలో ఉన్న నితిన్‌కు సై సినిమా అందించిన సక్సస్ హ్యట్రిక్ వచ్చేలా చేసింది. హీరోగా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసింది.