నారా రోహిత్ ఎంగేజ్మెంట్ ఫిక్స్.. వధువు ఎవరంటే..?

బాణం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నారా రోహిత్‌కు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ మూవీ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ టాలెంటెడ్ హీరో.. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నాడట‌. తాజాగా నారా రోహిత్ ఎంగేజ్మెంట్ కూడా ఫిక్స్ అయిందని.. ఈ నెల 13న హైదరాబాద్‌లో నారా రోహిత్ ఎంగేజ్మెంట్ గ్రాండ్ లెవెల్‌లో జరగనుందని స‌మాచారం. ఈ క్రమంలో నారా రోహిత్ వివాహం చేసుకోబోయే ఆ అమ్మాయి ఎవరు అనే ఆసక్తి అభిమానులు నెలకొంది.

Pratinidhi 2 (2024) - IMDb

ఇంతకీ వధువు మరెవరు కాదట‌.. ప్రతినిధి 2 సినిమాలో నారా రోహిత్ తో కలిసి నటించిన సిరి లెళ్ళాను వివాహం చేసుకోబోతున్నాడట. ఇక సీరి లెళ్ళకు ఇదే తెలుగులో మొదటి సినిమా.. తర్వాత ఈ అమ్మడు మరే సినిమాలోని నటించలేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు నారా రోహిత్ ఈ అమ్మడి తోనే కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయబోతున్నాడని తెలుస్తుంది. ఇక సినిమాలకు దూరంగా ఉన్నా సిరి లెళ్ళా.. ఇన్స్టాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటుంది. ఈ క్రమంలోనే నారా రోహిత్ తో ఎంగేజ్మెంట్ పై పలు వార్తలు వినిపించినా.. అమ్మడి నుంచి ఎలాంటి అనౌన్స్‌మెంట్‌ రాకపోవడం గమనార్హం. కేవలం కుటుంబ సభ్యులు, పలువురు బంధుమిత్రుల సమక్షంలో వీరి ఎంగేజ్మెంట్ ప్రైవేట్ గా జరగనుంద‌ట‌.

Prathinidhi 2 (2024) - Movie | Reviews, Cast & Release Date - BookMyShow

అయితే దీనిపై ఇంకా అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది. ఇక ప్రస్తుతం నారా రోహిత్ నటించిన సుందరకాండ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతుంది. మరోవైపు నారా రోహిత్, విజయ్‌కుమార్ కనకమెడల డైరెక్షన్లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్ తో కలిసి మల్టీ స్టార‌ర్ నటించనున్నాడు. తమిళ్ మూవీ అమరాన్‌కి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాను 2025 సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారట. ఇక ఈ జంట పెళ్లి విషయంలో వస్తున్న వార్తలపై ఎప్పుడు క్లారిటీ ఇస్తారు వేచి చూడాలి. సాధారణంగా నారా రోహిత్ కాంట్రవర్సీలకు చాలా దూరంగా ఉంటారు. కనుక ఈ వార్తల్లో నిజం ఉంటే అఫీషియల్‌గా క్లారిటీ ఇస్తారన‌డంలో సందేహం లేదు. మరోవైపు నారా ఫ్యాన్స్ అంతా ఆ హీరోయిన్ బ్యాక్ గ్రౌండ్ ఏంటో అంటూ సెర్చింగ్‌లు మొదలు పెట్టేసారు.