అక్కినేని నాగార్జున నటవారసుడు నాగచైతన్యకు టాలీవుడ్ లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మొదట్లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతను ప్రేమించి వివాహం చేసుకున్న చైతన్య.. సమంతకు విడాకులు ఇచ్చేసిన సంగతి తెలిసిందే. అయితే సమంతతో డివోర్స్ తర్వాత నాగచైతన్య శోభిత డేటింగ్ లో చైతూ ఉన్నాడంటూ ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఆ వార్తలను నిజం చేస్తూ శోభిత , నాగచైతన్య ఎంగేజ్మెంట్ చేసుకొని ఫాన్స్ కు షాక్ ఇచ్చారు. అయితే ప్రస్తుతం నాగచైతన్యకు సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ నెటింట వైరల్ అవుతుంది. గతంలో నాగచైతన్య ప్రేమించి వివాహం చేసుకున్న సమంత, ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్న శోభితతో కాకుండా మరో స్టార్ హీరోయిన్‌తో.. చైతూ ఒకే ఇంట్లో ఉన్నాడంటూ వార్తలు తెగ వైరల్ గా మారుతున్నాయి. ఇంతకీ నాగచైతన్య ఏ హీరోయిన్ తో కలిసి ఉన్నారు.. అసలు దాని వెనక స్టోరీ ఏంటో ఒకసారి తెలుసుకుందాం.
సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీస్ అంతా పెళ్ళికి ముందు డేటింగ్ చేయడం అనేది చాలా కామన్. అలా నాగచైతన్య కూడా పెళ్లికి ముందు శోభితతో రిలేషన్ ను మెయింటైన్ చేశారు. ఇక త్వరలోనే వీరిద్దరు వివాహం చేసుకోమన్నారు. అలాంటిది కాబోయే భార్య శోభితతో కాకుండా.. మరో స్టార్ హీరోయిన్ తో చైతు ఒకే ఇంట్లో కనిపించడం ఏంటి.. అంటూ అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు నేషనల్ క్రష్ రష్మిక మందన్న. అవును ఇది నిజమే. రష్మిక మందన, నాగచైతన్య ఇద్దరు ఒకే ఇంట్లో ప్రత్యక్షమయ్యారు. అయితే వీరిద్దరూ ఒకే రూంలో కలిసి కనిపించలేదు. అలా అని వీరిద్దరి కాంబోలో సినిమా కూడా రావడం లేదు. అదంతా సర్లే కానీ అసలు వీరిద్దరూ ఒకే ఇంట్లో ఎందుకు ఉన్నారు.. అనే కదా మీ సందేహం. వీరిద్దరూ ఒకే ఇంట్లో కనిపించడానికి ప్రధాన కారణం కళ్యాణ్ జ్యువెలర్స్ ఎమ్‌డి కళ్యాణ్ రామన్.
తాజాగ తన ఇంట్లో నవరాత్రి వేడుకలను గ్రాండ్ లెవెల్లో జరుపుకున్న కళ్యాణ్ రామన్.. నవరాత్రి వేడుకల కోసం ఎంతమంది సెలబ్రిటీలను తన ఇంటికి ఆహ్వానించాడు. ఇందులో భాగంగా ఈ వేడుకల్లో సినీ ఇండస్ట్రీలో చాలామంది పాల్గొని సందడి చేశారు. అలా సౌత్ ఇండస్ట్రీ సంబంధించి సెలెబ్రెటీస్ త్రిసూర్ లోని కళ్యాణ్ జువెలర్స్ ఎమ్‌డి కళ్యాణ్ రామన్ ఇంట్లో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. బాలీవుడ్ నటీనటులు శిల్పా శెట్టి, సైఫ్ అలీఖాన్, బాబి డియోల్, మల్లికా అరోరా, అజయ్ దేవగణ్ నార్త్ ఇండస్ట్రీ నుంచి వేడుకల్లో పాల్గొనగా.. సౌత్ ఇండస్ట్రీ నుంచి రష్మిక మందన, అలాగే అక్కినేని హీరో నాగచైతన్య ఈ నవరాత్రి వేడుకల్లో సందడి చేశారు. వీళ్ళు మాత్రమే కాదు కన్నడ ఇండస్ట్రీలోనూ పలువురు ఫేమస్ నటులు సతీసమేతంగా వచ్చి వేడుకల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.