ఈ ఫోటోలో ఉన్న కుర్రోడు టాలీవుడ్ క్రేజీ హీరో.. గెస్ చేస్తే మీరు జీనియస్..!

గతంలో సోషల్ మీడియా లేనప్పుడు ఏదైనా వార్త బయటకు రావాలంటే మెయిన్ మీడియా ద్వారానే అది బయటకు వచ్చేది. దానికి చాలా సమయం కూడా అయిపోయేది. దీంతో చాలామంది స్టార్ సెలబ్రిటీలకు సంబంధించిన చిన్న చిన్న విషయాలు ఎవరికి తెలిసేవి కాదు. కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అసలు బయట ప్రపంచానికి తెలియని ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పైగా సినీ సెలబ్రెటీలకు సంబంధించిన చిన్నప్పటి ఫొటోస్ అయితే క్ష‌ణాలో వైరల్‌గా మారుతున్నాయి. ఏదైనా అకేషన్ ఉంటే చాలు హీరోలు, హీరోయిన్లు వాళ్ళ చిన్ననాటి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకుంటూ.. వారి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు.

Nani film with Sujeeth shelved?

ఇలా సెలబ్రిటీల చైల్డ్హుడ్ పిక్స్ వైరల్ గా మారినప్పుడు.. తమ అభిమాన హీరో లేదా హీరోయిన్ ఫొటోస్ బయటకు వస్తే వాటిని తెగ వైరల్ చేస్తూ ఫ్యాన్స్ లైక్‌ల‌ వర్షం కురిపిస్తున్నారు. అలా తాజాగా నెటింట ఈ పై ఫోటో వైరల్ గా మారింది. ఈ ఫోటోలో ఉన్న చిన్నోడు ప్రస్తుతం టాలీవుడ్ క్రేజీ హీరో. లక్షలాదిమంది అమ్మాయిల హృదయాలను దోచుకున్న ఈ హీరో తన నటనతో వరుస సక్సెస్‌లు అందుకుంటూ దూసుకుపోతున్నాడు. ఈ చిన్నోడు ఎవరో గుర్తుపడితే మీరు నిజంగా జీనియస్. అతను అసిస్టెంట్ డైరెక్టర్గా మొదటి కెరీర్ ను ప్రారంభించి హీరోగా అవకాశాన్ని దక్కించుకున్నాడు. చిన్న సినిమాల్లో హీరోగా నటిస్తూనే స్టార్ హీరోగా మారాడు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు.

South Indian Film Star Naveen Babu Ghanta: A Journey of Talent and  Perseverance - Filmibeat

ఇప్పటికైనా గుర్తుపట్టారా.. సర్లేండి మేమే చెప్పేస్తాం. అతను ఎవరో కాదు నేచురల్ స్టార్ నాని. తొలి సినిమా అష్టా చమ్మతోనే ఇండస్ట్రీలో త‌న‌ నటనకు మంచి మార్కులు కొట్టేసాడు. తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమా అవకాశాలను దక్కించుకుంటూ సక్సెస్ అందుకొని స్టార్ హీరోగా ఎదిగాడు. తన నాచురల్ నటనతో పక్కింటి కుర్రాడులా కనిపించి అందరిని ఆకట్టుకున్నాడు. క్లాస్, మాస్, యాక్షన్ అని తేడా లేకుండా అన్ని జాన‌ర్లలో తన సత్తా చాటుకుంటున్నాడు. ఇలా చివరిగా నాని నటించిన నాలుగు సినిమాలు జెసి, హాయ్ నాన్న, దసరా, స‌రిపోదా శనివారం అన్ని సినిమాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ సక్సెస్‌లు అందుకుని.. తన ర్యాంపేజ్‌ చూపించాడు. అంతకంతకు తన ఇమేజ్ను పెంచుకుంటూ పోతున్న ఈ హీరో.. టైర్ 2 హీరోల లిస్టులో టాప్ 1గా నిలిచాడు. ఈ క్రమంలోనే నాని తన నెక్స్ట్ సినిమాలపై కూడా ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను పెంచేస్తున్నాడు.