స్టార్ నటుడు సత్యరాజ్‌కు సౌత్ఆడియన్స్ ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తమిళ్ హీరోగా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సత్యరాజ్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా దూసుకుపోతున్నాడు. వయసుకు తగ్గ పాత్రలో నటిస్తూ తనదైన స్టైల్ తో రాణిస్తున్నాడు. కీలక పాత్రల్లో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. తెలుగులో ఎన్నో సినిమాలో నటించిన మెప్పించిన సత్యరాజ్.. స్టార్ హీరోలకు తండ్రిగా, తాతగా కనిపించి ఆకట్టుకున్నాడు.
అలా మిర్చి, శంఖం, ఉన్నది ఒక్కటే జిందగి, ప్రతిరోజు పండగే లాంటి ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాల్లో నటించాడు. కాగా రాజమౌళి, ప్రభాస్ కాంబోలో తెరకెక్కిన బాహుబలి తో ఒక్కసారిగా ఆయన ఇమేజ్ అమాంతం పెరిగింది. కట్టప్ప పాత్రతో సత్యరాజ్ కు సౌత్ లోనే కాదు.. నార్త్ లోను వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. అలా ఇంత పెద్ద స్టార్ సెలబ్రెటీ స్టేజ్‌లో ఉన్న సత్యరాజ్ మాత్రం.. మీడియాకు దూరంగా ఉండడానికి ఇష్టపడతాడు. పర్సనల్ లైఫ్ గురించి బయటకు తెలియకుండా మెయింటైన్ చేస్తూ ఉంటాడు.
ఇక సత్యరాజ్ భార్య, కొడుకు, కూతురు ఉన్నారన్న సంగతి చాలా మందికి తెలియదు. ఇక సత్యరాజ్ కొడుకు సిబిరాజ్ ప్రస్తుతం హీరోగా ఎంట్రీ ఇచ్చి.. పలు సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. అయితే కూతురు దివ్య సత్యరాజ్ మాత్రం ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ న్యూట్రిషియన్‌గా లైఫ్ లీడ్ చేస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు.. హెల్త్, లైఫ్ స్టైల్ టిప్స్ ఫాలోవర్ తో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే దివ్యసత్యరాజ్ ఫొటోస్ నెటింట వైరల్ గా మారుతున్నాయి. సత్యరాజ్ కూతురు ఎంతో అందంగా ఉందంటూ.. స్టార్ హీరోయిన్లు కూడా అమ్మడి అందం ముందు బలాదూర్ అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.