” రాజాసాబ్ ” కు ప్రభాస్ కెరీర్‌లో టాప్‌లేపే రెమ్యున‌రేష‌న్‌…!

టాలీవుడ్ హైయెస్ట్ రెమ్యున‌రేష‌న్ తీసుకునే స్టార్ హీరోలలో మొదట వినిపించే పేరు ప్రభాస్. తెలుగులో రూ.100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకున్న ఫస్ట్ టాలీవుడ్ హీరోగా ప్రభాస్ ఇప్పటికే రికార్డ్ క్రియేట్ చేశాడు. బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ తనకంటూ ప్రత్యేకమైన క్రియేట్ చేసుకున్న రెబల్ స్టార్.. తాజాగా తన 45వ పుట్టినరోజు జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. ప్రభాస్ లైన‌ప్‌లో ఉన్న ప‌లు సినిమాల అప్డేట్స్ నెటింట‌ వైరల్‌గా మారాయి. అలా తాజాగా మారుతి డైరెక్షన్‌లో తెర‌కెక్కుతున్న రాజాసాబ్‌ మోషన్ పోస్టర్ రిలీజై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

Prabhas looks dapper in the new poster of The Raja Saab | Filmfare.com

ఇక ప్రభాస్ ఈ సినిమాలో ముసలి రాజా గెటప్‌లో కనిపించనున్నాడు. కాగా మారుతి ఈ సినిమా పై మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికర అప్డేట్స్ షేర్ చేసుకున్నాడు. ఈ సినిమా పూర్తి కామెడీ ఎలిమెంట్స్ తో హారర్ ఎంటర్టైనర్ గా రూపొందుతుందని చెప్పుకొచ్చాడు. అలాగే స్టోరీ మొత్తం రివీల్ అయ్యేలా ఎన్నో హింట్స్ కూడా ఇచ్చాడు. కాగా.. ఈ పోస్ట‌ర్‌ చూసిన తర్వాత.. రాజాసాబ్ సినిమా కోసం రెబ‌ల్ స్టార్ టాప్‌లేపే రేంజ్‌లో రెమ్యూనరేషన్ తీసుకున్ని ఉంటాడు ఆభిప్రాయాలు వ్య‌క్త‌మ‌య్యాయి.

The Raja Saab Teaser Out; Prabhas Starrer Promises A Throwback To His  Romantic Films - Entertainment

ప్రభాస్ తన కెరీర్‌లో ఎన్నో బడా సినిమాల్లో నటించి మెప్పించాడు. అయితే ఏ సినిమా కోసం అంతగా హెవీ మేకప్ కానీ.. ముసలి గెటప్ కానీ వేసుకుని కనిపించలేదు. ఈ క్రమంలోనే రాజసాబు ప్రభాస్ రెమ్యూనరేషన్ నెటింట వైర‌ల్‌గా మారింది. అయితే ఈ సినిమాకు ప్రభాస్ కోట్లలో రెమ్యున‌రేష‌న్‌ తీసుకోలేదట. కేవలం రూ.70 లక్షల రెమ్యూనరేషన్ మాత్రమే ఆయన అందుకున్నట్లు సమాచారం. మిగతాది మొత్తం సినిమా రిలీజై రిజ‌ల్ట్ వచ్చిన తర్వాత షేర్స్ లో తీసుకోవాలని ఆయన భావిస్తున్నాడట. ఇక ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరోగా మారిన తర్వాత.. రూ.100 నుంచి రూ.150 కోట్ల రెమ్యున‌రేష‌న్‌ తీసుకుంటున్న క్రమంలో.. మరి ఇంత తక్కువ రెమ్యున‌రేష‌న్‌ తీసుకోవడం అందరికీ షాక్‌ కలిగిస్తుంది.