సినిమాల కంటే రూమర్లతోనే సంచలనంగా మారిన ఈ బాలయ్య బ్యూటీని గుర్తుపట్టారా..?

ఈ పై ఫోటోలో కనిపిస్తున్న ముద్దుగుమ్మ బాలయ్య హీరోయిన్. 1990లో స్టార్ హీరోయిన్గా తన సత్తా చాటుకున్న ఈ ముద్దుగుమ్మ.. దాదాపు అప్పటి టాలీవుడ్ అగ్ర హీరోల అందరి స‌ర‌స‌న నటించిన మెప్పించింది. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్, కోలివుడ్‌, భోజ్‌పూరిలోను తన సత్తా చాటుకున్న ఈ అమ్మడు.. సినిమాల్లో కంటే ఎఫైర్ వార్తలతోనే ఎక్కువ సంచలనంగా మారింది. సినిమాలతో స్టార్ హీరోయిన్గా ఇమేజ్‌ క్రియేట్ చేసుకున్న ముద్దుగుమ్మ పర్సనల్ లైఫ్ మాత్రం ఎప్పుడూ వివాదాస్పదంగానే ఉండేది. నలుగురు పెళ్లయిన సెలబ్రిటీలతో ఈ అమ్మడు ఎఫైర్ నడిపింది అంటూ వార్తలు తెగ సంచలనగా మారేవి అందులో ముగ్గురు హీరోలు, ఒకరు స్టార్ క్రికెటర్ ఉన్నారు.

When Nagma Broke Silence On Her Alleged Affair With Sourav Ganguly & Their  Break Up: “There Was A Career At Stake, Besides Other Things..."

ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరో చెప్పలేదు కదా.. తనే ఒక అప్పటి స్టార్ బ్యూటీ నగ్మా. 1974లో హిందూ తండ్రికి, ముస్లిం అమ్మకు నగ్మా జన్మించింది. ఇక ఈమె తండ్రి రాజస్థాన్ జహిస్తాల్మేర్ రాజా ఫ్యామిలీకి చెందిన వ్యక్తి. తర్వాత ఫ్యామిలీ మొత్తం కలిసి గుజరాత్ కు అక్కడి నుంచి ముంబైకి మక్కాం మార్చారు. ఈ క్రమంలో నగ్మా టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, భోజ్‌పురి సినిమాల్లో విపరీతమైన పాపులారిటి దక్కించుకుంది. తెలుగులో బాల‌కృష్ణ అశ్వ‌మేధం సినిమాలో న‌టించి మెప్పించిన న‌గ్మ‌.. అప్ప‌ట్లో చిరు, సుమ‌న్ లాంటి స్టార్ హీరోల‌తోను స్క్రీన్ షేర్ చేసుకుంది. తమిళ్లో ఈమెకు ఏకంగా అభిమానులు గుడికట్టి మరి పూజించారు. కానీ.. నగ్మా పర్సనల్ లైఫ్ మాత్రం వివాదాలతో ఎప్పుడు వైరల్ అవుతూనే ఉండేది. మీడియా కథనాలు ప్రకారం అప్పట్లో నగ్మా టీమ్ ఇండియన్ కెప్టెన్ సౌరవ్ గంగూలీతో ప్రేమాయణం నడిపిందట. తిరుపతిలో రహస్యంగా వీళ్ళ‌ పెళ్లి కూడా చేసుకున్నారని వార్తలు వినిపించాయి.

நக்மாவை நம்பி நடு தெருவுக்கு வந்த சரத்குமார்..! வாழ்கை கொடுத்த ராதிகா போட்ட  கண்டிஷன் என்ன தெரியுமா.? - Dinaseval News

తర్వాత సౌరవ్ భార్య దీనిపై స్పందించడంతో వీళ్ళ లవ్ ట్రక్‌కు బ్రేక్ పడింది. ఎవరి జీవితంలో వారు బిజీ అయ్యారు. ఇక రాధిక ప్రస్తుత భర్త శరత్ కుమార్ తోను నగ్మా గతంలో డేటింగ్ చేసిందట‌. అయితే రాధిక, శరత్ కుమార్ మ్యారేజ్ తో ఈ వార్తలకు బ్రేక్ పడింది. కాగా టాలీవుడ్, బాలీవుడ్‌లో అవకాశాలు తగ్గడంతో.. భోజ్‌పూరి వైపు దృష్టి మళ్లించిన నగ్మా.. అక్కడ పలు సూపర్ హిట్ సినిమాల్లో ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే భోజ్పురి సూపర్ స్టార్ రవికిషన్‌తో ప్రేమాయణం నడిపిందట. చాలాకాలం డేటింగ్ చేశారని భోజ్పురి మీడియాలో ఎన్నో వార్తలు వినిపించాయి. ఇక న‌గ్మాతో ఎఫైర్‌ గురించి రవికిషన్ ఎప్పుడు దాచే ప్రయత్నం చేయలేదు. రవి కిషన్, భార్య ప్రీతి అతనితో గొడవపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. తర్వాత రవి కృషన్‌తో బంధం ముగిసింది.

When married BJP leader Ravi Kishan fell in love with Nagma, he had openly  expressed his love with Wife - शादीशुदा बीजेपी नेता रवि किशन जब इस एक्ट्रेस  के साथ जोड़ बैठे

ఇక తర్వాత నగ్మా మరో భోజ్పూరి నటుడు మనోజ్ తివారితో ప్రేమాయణం నడిపిందట. అప్పట్లో రవి కిషన్, మనోజ్ తివారి మధ్య భోజ్పురిలో గట్టి పోటీ ఉండేది. అయితే అప్ప‌ట్లో మనోజ్ తివారి.. నగ్మాతో సినిమాలు చేసినంత మాత్రమే ఇలాంటి ఎఫైర్లు అంటగట్టడం సరికాదు అంటూ అభిమానుల నుంచి పలు కామెంట్లు కూడా వ్యక్తం అయ్యాయి. ఇక ఈ వార్తలు వినిపిస్తున్న సమయంలో సౌరబ్‌, శరత్ కుమార్, రవి కిషన్, మనోజ్ తివారి నలుగురు వివాహితులే కావడం గమనార్హం. ఇక ఇక్కడ మరో ఇంటరెస్టింగ్ విషయం ఏమిటంటే.. నగ్మా తో సహా ఆమెతో ఎఫైర్ నడిపిన ఈ నలుగురు కూడా ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతున్నారు. మనోజ్ తివారి, రవి కిషన్ బిజెపి తరఫున లోక్సభ సభ్యులుగా రాణిస్తుంటే.. సౌరవ్ గంగూలీ, శరత్ కుమార్ బిజెపిలో ఉన్నారు. నగ్మా కాంగ్రెస్ పార్టీ తరఫున రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు. ఇటీవల ఉత్తరప్రదేశ్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయింది.

4 शादीशुदा मर्दों संग रहा नगमा का अफेयर, लेकिन 47 की उम्र में भी कुंवारी,  जीती है ऐसी जिंदगी