సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ సెలబ్రిటీస్ ఉన్నా.. మల్టీ టాలెంటెడ్ యాక్టర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. అలా మన టాలీవుడ్‌లో ఎలాంటి పాత్రనైనా నటించి ప్రేక్షకులను మెప్పించగల సత్తా ఉన్న నటులలో సీనియర్ హీరో రాజేంద్రప్రసాద్ ఒకరు. ఒకప్పుడు సినిమాల్లో హీరోగా నటించి. తన హీరోయిజ్, కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈయన.. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాల్లో కీలక పాత్రలో నటించి మెప్పించారు. ఇక రాజేంద్రప్రసాద్ మొదటి నుంచి ఏ పాత్రలో నటించినా.. ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మరి జీవించేస్తారు.
అలా మొదట కామెడీ హీరోగా ఇండస్ట్రీలో ఇమేజ్ సంపాదించుకున్న రాజేంద్రప్రసాద్.. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, మల్టీ స్టారర్ సినిమాలోను అలాగే హీరోల సన్నిహితుడుగాను నటించి మెప్పిస్తున్నాడు. ఇప్పటికీ ఇండస్ట్రీలో పలు సినిమాల్లో నటించి ఆకట్టుకుంటున్నాడు. ఇక ఆయన సినీ కెరీర్‌లో హీరోగా రాణిస్తున్న సమయంలో ఎంతోమంది హీరోయిన్లతో ఆడి పాడారు. స్టార్ హీరోయిన్లు కూడా ఆయన సరసన నటించారు. అలా రాజేంద్రప్రసాద్ గతంలో హీరోయిన్ తో ప్రేమలో పడ్డారని రూమర్లు తెగ వినిపించాయి. ఇప్పటికి అదే వార్త నెటింట వైరల్ అవుతూనే ఉంది. ఈ క్రమంలోనే రాజేంద్రప్రసాద్‌తో పాటు ఆ స్టార్ హీరోయిన్ కూడా ఈ విషయంపై రియాక్ట్ అయ్యారు.
ఆమె ఎవరో చెప్పలేదు కదా.. తనే రజిని. టాలీవుడ్ సినిమాల్లో.. రాజేంద్రప్రసాద్తో ఎక్కువ సినిమాల్లో నటించి మెప్పించిన ఈ సీనియర్ ముద్దుగుమ్మ రాను రాను సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. అయితే అప్పట్లో రాజేంద్రప్రసాద్ రజినీ కాంబో మూవీస్ మంచి పాపులారిటీతో దూసుకుపోయేవి. అలా వీరిద్దరి కాంబోలో ఎక్కువ సినిమాలు రావడంతో రాజేంద్రప్రసాద్, రజిని ప్రేమలో పడ్డారంటూ రూమర్లు వినిపించాయి. ఈ విషయంలో రాజేంద్రప్రసాద్ రియాక్ట్ అవుతూ ఎక్కువ సినిమాలు చేసిన హీరోయిన్లతో ప్రేమలో ఉన్నామంటూ రూమర్లు సాధారణంగా వస్తూ ఉంటాయి. అందులో వింతేముంది అంటూ చెప్పుకొచ్చారు. ఏ కోసైనా కొంతైనా ఎందులో నిజం లేదంటారా అనీ యాంకర్ ప్రశ్నించగా.. అందరూ అంటూ ఉంటే అభిమానం పెరుగుతుంది కానీ.. వాళ్ళ ప్రచారం చేసినంత ఏది ఉండదు అంటూ రాజేంద్రప్రసాద్ వెల్లడించారు.