తొలిసారి కోటి రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకున్న ఇండియ‌న్‌ హీరో ఎవరో తెలుసా..?

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో రాణిస్తున్న హీరోలకు కోటి రూపాయల రెమ్యునరేషన్ అంటే అది పెద్ద విషయం కాదు. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఒకటి రెండు సినిమాలతో సక్సెస్ అందుకున్న యంగ్ హీరోలు కూడా.. కోటి రూపాయల రెమ్యునరేషన్ చార్జి చేసేస్తున్నారు. అదే ఒకప్పుడైతే కోటి రూపాయల రెమ్యునరేషన్ అంటే చాలా పెద్ద మేటర్. అది ఎంతో పెద్ద అమౌంట్ అని అంత భావించేవారు. అలాంటి రోజుల్లో మొట్టమొదటి కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్న ఇండియన్ స్టార్ హీరో ఎవరో తెలుసుకోవాలని ఆసక్తి అందరిలోనూ ఉంటుంది.

Watch Aapath Bandhavudu (Telugu) Full Movie Online | Sun NXT

అయితే 90 లోనే దేశంలోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్న వారి జాబితాలో మొదట చిరంజీవి పేరు వినిపిస్తోంది. 1992లో డైరెక్టర్ కె.విశ్వనాథర్ తెర‌కెక్కించిన ఆపద్బాంధవుడు సినిమాకు చిరంజీవి మొదటిసారి రూ.1. 25 కోట్ల రెమ్యూనరేషన్ను అందుకున్నాడు. ఈ సినిమా సమయంలో మెగాస్టార్ కెపాసిటీ ఏంటో బాలీవుడ్ కి కూడా ప్రూవ్ అయింది. అయితే అప్పట్లో బాలీవుడ్ బిగ్‌బీ అమితాబచ్చన్ రెమ్యూనరేషన్ రూ.70 లక్షలు మాత్రమే కావడం గ‌మ‌నార్హం. చిరు తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ ఈ లిస్ట్‌లోకి చేరారు.

Kamal Haasan Reveals Why He Hasn't Acted With Rajinikanth In 40 Years:  "It's Not A New Combination"

1994లో కమల్ ఓ సినిమాకు కోటి రూపాయలు తీసుకున్నారు. అదే ఏడాదిలో రజనీకాంత్ కూడా మరో సినిమాకు కోటి రూపాయల రమ్యునరేషన్ ఛార్జ్ చేశాడు. 1998 నుంచి 99 లో అమితాబ్, షారుక్, సల్మాన్ ఇలా ఒక్కొక్కరిగా సినిమాకు కోటి రూపాయల రమ్యున‌రేషన్ తీసుకోవడం ప్రారంభించారు. ఇక త్వ‌ర‌లో మెగాస్టార్ చిరంజీవి విశ్వంభ‌ర‌తో ఆడియ‌న్స్ ముందుకు రానున్నారు. ఈ సినిమాకు మెగాస్టార్ రెమ్యూనరేషన్ రూ.60 నుంచి రూ.70 కోట్ల వరకు ఉందని టాక్.

Happy birthday, Mr Amitabh Bachchan: What you may not know about India's  biggest star | The Indian Express