టాలీవుడ్ హీరో వేణు ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్‌ను తన సినిమాలతో విపరీతంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. డిఫరెంట్ కంటెంట్ ఎంచుకుంటూ.. ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన వేణు.. కెరీర్‌లో మంచి సక్సెస్ అందుకున్న సినిమాల్లో చెప్పవే చిరుగాలి సినిమా కూడా ఒకటి. విక్రమన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో మంచి సక్సెస్ అందుకుంది. వేణు తొట్టెంపూడి ఇందులో హీరోగా నటించగా.. అభిరామి, ఆషిమా బల్ల హీరోయిన్లుగా కనిపించి ఆకట్టుకున్నారు.
సునీల్, బేతా సుధాకర్, ఎల్వి శ్రీరామ్, కృష్ణ భగవాన్, కైకాల సత్యనారాయణ కీలకపాత్రలో కనిపించారు. ఈ సినిమా ఆడియన్స్ లో మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక ఈ సినిమాలో తన అందం, అమాయకత్వం ట్రెడిషనల్ లుక్‌తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న అభిరామి.. మంచి పాపులారిటీ దక్కించుకుంది. ఎంతో మంచి ఇమేజ్ సంపాదించుకుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా తర్వాత పలు బాలీవుడ్ సినిమాల్లో నటించినా ఊహించిన రేంజ్‌లో అమ్మడు సక్సెస్ సాధించలేకపోయింది.
ఇక తెలుగుతో పాటే కన్నడ, మలయాళ, తమిళ్ సినిమాల్లోనూ వరుస సినిమాల్లో నటించిన అభిరామి.. 2000 సంవత్సరం తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిపోయింది. దీంతో ఆమె ఇండస్ట్రీకి దూరమైంది. దాదాపు పదేళ్ళ గ్యాప్ తర్వాత 2014 మాలయాల మూవీతో రియంట్రి ఇచ్చింది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లోను వరుస సినిమాలో నటిస్తుంది. అయితే అప్పుడు ఎంతో ట్రెడిషనల్ లుక్‌తో అమాయకత్వంతో ఆకట్టుకున్న అభిరామి.. ప్రస్తుతం తన గ్లామర్ ట్రీట్తో.. హాట్ నెస్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ పిక్స్, వీడియోస్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ ఫ్యాన్స్‌ను మెపిస్తుంది.