టాలీవుడ్ పాపులర్ సెలబ్రిటీ కపుల్‌లో రామ్ చరణ్ – ఉపాసన జంట ఒకటి. మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా ఈ జంటకు మంచి ఇమేజ్ ఉంది. ఇక మొదట్లో ఉపాసన పలు విమార్శలు ఎదుర్కొన్న.. ఇప్పుడు ఆమెపై విమర్శించిన వారే ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈ ఏడాది.. ఈ జంట మెగా అభిమానులకు శుభవార్త అందించిన సంగతి తెలిసిందే. పెళ్లయిన 11 ఏళ్ల తర్వాత తల్లిదండ్రులైన చరణ్ , ఉపాసన.. క్లీన్ కారా కు జన్మనిచ్చారు. ఈ కుట్టి రాకతో మెగా ఫ్యామిలీ పేట్ మారిపోయిందని.. ఆమె మెగా ఫ్యామిలీ లక్కీ చాంప్ అంటూ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
అయితే ఆమె పుట్టి ఏడాది దగ్గర పడుతున్న ఇంకా చరణ్ – ఉపాసన దంపతులు ఇప్పటివరకు క్లీన్ కారాను బయట ప్రపంచానికి చూపించలేదు. దీంతో క్లింకారా ఎలా ఉంటుందో చూడాలని ఆసక్తి మెగా అభిమానులలో మరింతగా పెరిగిపోతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా మెగా కోడలు ఉపాసన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. మ్యాగజైన్ కవర్ పేజ్‌పై చరణ్ దంపతుల ఫోటో గతంలో వచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే రామ్ చరణ్ తన భార్య ఉపాసనని ముద్దుగా ఉప్సి.. ఉప్సి.. అంటూ పిలుచుకుంటూ ఉంటారట. ఫోన్లో కూడా అదే పేరుతో సేవ్ చేసుకున్నాడని సమాచారం.
మొదటి నుంచి చరణ్‌కి ఉపాసనను అలా పిలవడమే ఇష్టమని.. ఆశ్చర్యం ఏంటంటే ఫ్యామిలీ అంతా కూడా ఎంతో ప్రేమగా ఉపాసనను ఉప్సి అనే పిలుస్తారని సమాచారం. అటు ఉపాసన కూడా మెగా ఫ్యాన్స్‌కి ఎంతో విలువని ఇస్తుంది. ఇక ప్రస్తుతం చరణ్ టాలెంట్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో గేమ్ ఛేంజర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా 2025 సంక్రాంతి బరిలో జనవరి 14న రిలీజ్ కానుంది. ఆచార్యలాంటి ప్లాప్ తర్వాత చరణ్ నుంచి వస్తున్న సినిమా కావడం.. అదికూడా ఆర్‌ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియన్ సూపర్ హిట్ తర్వాత సోలాగా చరణ్ నటిస్తుండడంతో సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యాక.. ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వేచి చూడాలి.