ఇండస్ట్రీలో అడుగుపెట్టి తను నటించిన ఒక్కే సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్గా మారిన వారు ఎంతోమంది ఉన్నారు. ఫస్ట్ మూవీ తర్వాత వీరికి వరుస అవకాశాలు క్యూ కట్టిన అనూహ్యంగా సినిమాలకు దూరమైన సందర్భాలు కూడా ఉంటాయి. అందం, అభినయం, టాలెంట్ ఉన్న ఇండస్ట్రీలో తమదైన మార్క్ వదిలి సినిమాలకు గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. అందులో ఈ హీరోయిన్ కూడా ఒకటి. ఈ పై ఫోటోలో కనిపిస్తున్న ఎన్టీఆర్ హీరోయిన్ గుర్తుందా.. ఎన్టీఆర్ నటించిన శక్తి సినిమాలో సెకెండ్ హీరోయిన్గా నటించి మెప్పించింది మంజరి ఫడ్నేస్.
అల్లరి నరేష్ నటించిన సిద్దు ఫ్రం శ్రీకాకుళం అనే సినిమాలోను ఏమే హీరోయిన్గా నటించి ఆకట్టుకుంది. ఫస్ట్ మూవీతోనే గ్లామర్ షోతో కుర్రాళ్లను కవ్వించిన ఈ ముద్దుగుమ్మ.. తర్వాత కే. విశ్వనాధ్ డైరెక్షన్‌లో శుభ్రప్రదం సినిమాలో ఆకట్టుకుంది. ఇక ఈమె నటించిన అన్ని సినిమాలు మంచి సక్సెస్ అందుకున్నా అమ్మడికి ఊహించిన రేంజ్ లో ఆఫర్స్ రాలేదు. ఇక ఎన్టీఆర్ హీరోగా.. మెహర్ రమేష్ డైరెక్షన్‌లో తెరకెక్కిన శక్తి సినిమాలో ఈమె కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.
ఇందులో హీరోయిన్గా ఇలియానా నటించింది. అయితే ఈ సినిమా సక్సెస్ కాకపోవడంతో అమ్మడికి ఊహించిన ఫేమ్ రాలేదు. దీంతో తర్వాత బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ బిజీ అయింది. అలాగే వెబ్ సిరీస్‌లోను చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే చాలా కాలంగా టాలీవుడ్‌కు దూరమైన మంజరి.. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ కుర్రకారుని కట్టిపడేస్తుంది. ఈ క్రమంలోనే అమ్మడి లేటెస్ట్ హాట్ గ్లామర్ ట్రీట్ ఫొటోస్ నెటింట వైరల్‌గా మారుతున్నాయి. మీరు ఓ లుక్ వేసేయండి.
View this post on Instagram