ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ టాప్ హీరోలలో.. మార్కెటింగ్ స్కిల్స్ ఎక్కువగా ఉన్న నటుడు ఎవరు అంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు వినిపిస్తుంది. భార్య స్నేహ రెడ్డి తన సినిమాల విషయంలో లీడ్ తీసుకున్న తర్వాత.. బన్నీ రేంజ్ మరింతగా పెరిగింది. అలవైకుంఠపురం సినిమాతో బన్నీ రేంజ్ నేషనల్ లెవెల్‌కి వెళ్తే.. తర్వాత తెరకెక్కించిన పుష్పాతో ఇంటర్నేషనల్ లెవెల్‌కు బన్నీ ఇమేజ్ పెరిగిపోయింది. ఇప్పుడు బన్నీ మార్కెట్ పుష్పాకి ముందు.. పుష్ప తర్వాత.. అనే రేంజ్‌కు వచ్చింది. ఈ క్రమంలోనే త్వరలో పుష్ప 2 సినిమా.. ఆడియన్స్ ముందుకు రానుంది. దీనికి కూడా మార్కెటింగ్ ప్లాన్స్ వేరే లెవెల్లో ఉన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు బన్నీ ఆలోచనలు కూడా పుష్ప 2 మార్కెటింగ్ విషయంలో చాలా పెద్దగా ఉన్నాయని.. ఇదే టైంలో మెగా ఫాన్స్ ట్రోలింగ్ కూడా బన్నీని కంగారు పెడుతున్నట్లు సమాచారం.
పుష్ప 1 టైం లో కూడా మెగా ఫాన్స్ బన్నీని టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అప్పటి మీద ఇప్పుడు సోషల్ మీడియా ఇంపాక్ట్ మరింత ఉంటుంది. సినిమా రిజల్ట్ సోషల్ మీడియా డిసైడ్ చేస్తుంది. ఈ క్రమంలో బన్నీకి పుష్ప 2 రిజల్ట్ విషయంలో భయం పట్టుకుందట. మొన్నటి ఏపీ ఎలక్షన్స్ లో బన్నీ చేసిన ఒక్క పొరపాటు కారణంగా.. అటు జనసేన, ఇటు టిడిపి క్యాడర్లోని ఫ్యాన్స్ అంత బన్నిని గట్టిగానే టార్గెట్ చేస్తున్నారు. ఈ క్రమంలో పుష్ప2 విషయంలో ఎలాంటి ప్లాన్‌తో మెగా ఫాన్స్ దిగుతారో అనే టెన్షన్లో బన్నీ ఉన్నాడట. ఈ క్రమంలోనే ఆహాలో టెలికాస్ట్ అయ్యే అన్ స్టాపబుల్ సీజన్ 4లో పుష్ప టీం సందడి చేయనుందని.. ప్రమోషనల్ గా ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అవనుందని సమాచారం.
ఇక ఈ షోలాన్నే మెగా, అల్లు ఫ్యామిలి వివాదానికి చెక్ పెట్టే విధంగా స్నేహ రెడ్డి ప్లాన్ చేసిందట. బన్నీకి.. కూడా ఈ విషయంపై సలహా ఇచ్చిందట. వివాదాన్ని ఇప్పటికే పెద్దది చేశారు. ఎండ్‌కార్డు పడకపోతే.. ప్రీ బుకింగ్ మార్కెట్ పై కూడా ప్రభావం పడుతుంది. కనుక ఈ ప్రశ్నకు సమాధానం చెప్పి అందరికీ స్మూత్ గా కౌంటర్ ఇవ్వాలని బన్నీకి వివరించిందట. దానికి బన్నీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఈ క్రమంలోనే షోలో బాలయ్య అడిగే ప్రశ్న ఎలా ఉంటుంది.. దీనికి బన్నీ సమాధానం ఏ రేంజ్ లో ఉండబోతుందని.. ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. అయితే ఇప్పటికే వీరిద్దరూ ఆ ఎపిసోడ్‌ను షూట్ చేసేసారని.. దీపావళి స్పెషల్ గా ఎపిసోడ్ ను రిలీజ్ చేయాలని అనుకున్నా ఇప్పుడు దీపావళికి కాకుండా సినిమా రిలీజ్ కు వారం రోజులు ముందు షోను టెలికాస్ట్ చేస్తే ఆడియన్స్ లో ఇంపాక్ట్ ఉంటుందనే ఉద్దేశంతో టెలికాస్ట్ ను ఆపినట్లు తెలుస్తుంది. ఇక ఇప్పటికే మెగా ఫాన్స్ బన్నిపై కోపంతో రగిలిపోతున్నారు. ఈ క్రమంలోనే ఆయన చెప్పే సమాధానం వివాదానికి ఎలా ఏండ్ కార్డ్ వేస్తుందో చూడాలి.