కృష్ణకు సరిగ్గా ఇచ్చినవారు లేరు.. శోభన్ బాబుకు ఎగ్గొట్టిన వారు లేరా.. అదేంటంటే..?

ఒకప్పుడు ఇండస్ట్రీలో ఉన్న విధానానికి.. ఇప్పుడు ఇండస్ట్రీకి పూర్తిగా వ్యత్యాసం వచ్చేసింది. లెక్క‌ల‌ని మారిపోయాయి. ఏది చేయాలన్నా ప్రాపర్ గా ముందు మేనేజర్సే దగ్గర ఉండి చూసుకుంటున్నారు. గతంలో అలా కాదు.. హీరోలతోనే నిర్మాతలు డైరెక్ట్ గా బేరసారాలు మాట్లాడేవారు. నెలవారి జీతాలు ఇచ్చేవారు. సమయానికి నెల జీతం ఇచ్చేయడంతో ఎక్కువ డిమాండ్ చేసే పరిస్థితి కూడా ఉండేది కాదు. అలాగే నెల జీతాల తర్వాత రెమ్యున‌రేష‌న్‌ పద్ధతి మొదలైనా.. అప్పుడు కూడా నిర్మాతలే హీరోలతో మాట్లాడేవారు. ఇక అప్పటికి హీరోలకు.. మేనేజర్ల విధానం స్టార్ట్ కాలేదు. దీంతో ముందు డ‌బ్బు ఇచ్చిన ఇవ్వకపోయినా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి హీరోలు నటిస్తూ ఉండేవారు. అలా చాలామంది నిర్మాతలు హీరోలకు డబ్బులు ఎగ్గొట్టిన సందర్భాలు కూడా ఉండేవి.

TC.com Exclusive: Sobhan Babu's last Interview | Telugu Cinema

కొంతమంది టైంకి డబ్బులు ఇస్తే.. మరి కొంత మంది టైంకి డబ్బులు కూడా ఇచ్చేవారు కాదట. కానీ ఇప్పుడు అలా కాదు.. నిర్మాత చేత డబ్బులు ముక్కు పిండి మరీ వసూలు చేసుకుంటున్నారు హీరోస్. అయితే ఇండస్ట్రీలో.. 70,80లలో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబులు స్టార్ హీరోలుగా రాణిస్తున్న సమయం అది. మిగతావ‌ని పక్కన పెడితే శోభన్ బాబు మరియు కృష్ణ విషయంలో ఓ మాట ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. అప్పట్లో హీరో కృష్ణ సినిమాల్లో నటిస్తున్న క్రమంలో రెమ్యూనరేషన్ విషయంలో కచ్చితంగా ఉండేవారు కాదట‌. ఎంతిస్తే అంత తీసుకొని సినిమాల్లో నటించే వారిని.. చిన్న నిర్మాత, పెద్ద నిర్మాత అని చూశేవారు కాద‌ట‌. డబ్బును ఎప్పుడు డిమాండ్ చేసేవారు కాదట‌.

Veteran Telugu actor Krishna passes away - The Hindu

చాలా నిదానంగా డబ్బు విషయంలో వివరించేవారట. అలా కృష్ణకు దాదాపు కొన్ని కోట్ల రూపాయలు డబ్బు అప్పట్లో ఎంతో మంది నిర్మాతలు ఎగ్గొట్టేశారు. అదే టైంలో స్టార్ హీరోగా రాణిస్తున్న శోభన్ బాబు మాత్రం డ‌బ్బు విష‌యంలో కృష్ణకు పూర్తి విరుద్ధంగా ఉండేవారట. నిర్మాత డబ్బు ఇస్తే గాని షూటింగ్‌కు కదిలేవారు కాదని.. అందుకే ఆయన నటించిన దాదాపు అన్ని సినిమాలకు వసూళ్లు జాగ్రత్తగా చేసుకొని.. వాటిని పెట్టుబడుల్లో పెట్టి రియల్ ఎస్టేట్ ద్వారా వాటిని రెట్టింపు చేసుకుని.. కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని సృష్టించుకో గలిగారని టాక్‌. ఇక ఈ కారణంతోనే కృష్ణకు డబ్బులు సరిగ్గా ఇచ్చిన నిర్మాతలు ఉండరు.. శోభన్ బాబుకు రూపాయి ఎగ్గొట్టిన నిర్మాతలు ఉండరు అని.. ఇప్పటికీ చాలామంది అంటూ ఉంటారు.