ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. శంకర్ డైరెక్షన్‌లో గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ ఈ సినిమా డిసెంబర్ నెలలో క్రిస్మస్ కానుకగా రిలీజ్ కానుంది. సినిమా రిజల్ట్ విషయాన్ని పక్కన పెడితే.. చరణ్ ఈ సినిమా తర్వాత భారీ లైనప్ సిద్ధం చేసుకుని బిజీ బిజీగా ముందుకు సాగుతున్నాడు. ఇదిలా ఉంటే చరణ్ ఎలాంటి సినిమాలు నటించినా అవి మినిమం సక్సెస్ అయ్యేలా మెగా ఫ్యాన్స్ కృషి చేస్తారనడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే మంచి కంటెంట్ ఉంటే ఎలాంటి సినిమాల్లో అయినా నటించడానికి అసలు తడపడం లేదు చరణ్.
అలా చరణ్ తన తర్వాత సినిమాను బుచ్చిబాబుసనాతో చేస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత చరణ్ సుకుమార్‌తో మరో సినిమాలో నటించనున్నాడు. ఈ క్రమంలో బుచ్చిబాబు సినిమా సక్సెస్ విషయాన్ని పక్కన పెడితే.. సుకుమార్‌తో తెరకెక్కనున్న సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్న సుకుమార్.. ఎలాగైనా ఈ సినిమా సక్సెస్ తర్వాత చరణ్ తో సినిమా చేయాలని మంచి కథ సిద్ధం చేసుకున్నాడట.
ఇక చెర్రీ సినిమా సక్సెస్ కోసం కొన్ని క్యాలిక్యులేషన్స్ వేసుకున్నాడని.. ఇప్పటికే సుకుమార్ చేయబోయే సినిమాపై గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే చేసుకుని.. కథను రాసుకున్నట్లు తెలుస్తుంది. రంగస్థలం లాంటి సక్సెస్‌ను ఎలాగైనా తను తెరకెక్కించబోయే ఆ సినిమాతో కూడా చరణ్‌కు ఇవ్వాలని ప్రయత్నంలో ఉన్నాడట సుకుమార్. అయితే ఈ సినిమాల్లో మెయిన్ విలన్‌గా తమిళ్ ఇండస్ట్రీ స్టార్ హీరో అరవింద్ స్వామి నటించబోతున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే వీరిద్దరూ కాంబోలో ధృవ సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది, ఇక మరోసారి కలిసి సిపిమా చేస్తే.. వీరి పోరు ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయం అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.