ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక పుష్పలో ఆయన నాచురల్ నటనకు నేషనల్ అవార్డు కూడా దక్కించుకున్నాడు అల్లు అర్జున్. ఇక బన్నీ మొదటి నుంచి ఏదైనా సినిమాలో ఓ పాత్రకు నటిస్తున్నాడంటే దానికోసం ఎంతో శ్రమిస్తూ ఉంటారు. తన సినిమాతో ఎలాగైనా సక్సెస్ కొట్టాలనే కసితో వ్యవహరిస్తారు. అయితే ఇలాంటి క్రమంలోనే అల్లు అర్జున్ గతంలో ఓ యాక్షన్ సినిమా కోసం అమెరికా వెళ్లి మరి ట్రైనింగ్ తీసుకున్నారని.. అయితే ఆ సినిమా ఫ్లాప్ గా నిలిచిందన్న విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చిందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఏ పాత్ర కోసం బన్ని అంత శ్రమించారో.. ఆ సినిమా ఏంటో.. ఒకసారి చూధ్ధాం.
బన్నీ కెరీర్‌లో యాక్షన్ మూవీగా తెరకెక్కిన నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా 2018 లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఊహించిన రేంజ్‌లో సక్సెస్ అందుకోలేదు. దీనిపై ఎన్నో విమర్శలు కూడా తలెత్తాయి. ముఖ్యంగా బన్నీని చాలా మంది టార్గెట్ చేస్తూ ఆర్మీ జవాన్ గా అసలు నటించలేకపోయాడు అని క్రిటిసైజ్ చేసి నెగటివ్ కామెంట్స్ చేస్తూ వచ్చారు. అయితే అదే టైంలో ఓ విషయం కూడా బయటకు వచ్చింది. ఈ సినిమాకు వక్కాంతం వంశీ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఇక ఈ యాక్షన్ సినిమా కోసం కథ విన్న బన్నీ.. ఆర్మీ ఆఫీసర్ గా కనిపించాలని చెప్పడంతో ఎగ్జిట్ అయి ఆర్మీ జవాన్‌లా తయారు కావాలని.. ఎలాగైనా ఈ సినిమాతో సక్సెస్ అందుకోవాలని భావించాడట.
ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ జవాన్‌గా తయారు కావాలనుకున్నారట. అదే టైంలో మోస్ట్ పాపులర్ ఆర్మీ ఏది అని సెర్చ్ చేయగా.. అతనికి యూఎస్ ఆర్మీ అని తెలిసిందని.. దీంతో వెంటనే అమెరికా వెళ్లి మరి అదే ఆర్మీ వద్ద ట్రైనింగ్ తీసుకున్నాడని.. ఆరు నెలలు కష్టపడ్డాడని వార్త బయటకు వచ్చింది. ఇక దీంతో అసలైన ఆర్మీ అంటే మన ఇండియన్ ఆర్మీ.. ఇక్కడ పవర్ఫుల్ ఇండియన్ జవాన్లను వదిలేసి.. నువ్వు అమెరికా వెళ్లి ట్రైనింగ్ తీసుకోవడం ఏంటి అంటూ మరికొంతమంది ఫైర్ అయ్యారు. ఈ సినిమా తుసుమానడానికి అసలు కారణం అల్లు అర్జున్ సినిమాలో యాంగర్ ఇష్యూ తో సతమతమవుతూ ఉంటాడు. సైనికుడిగా సరిహద్దులో సేవ చేయాలని కలఉన్నా.. దాని నెరవేర్చుకోవడానికి ఎన్నో స్ట్రగుల్స్ ఎదుర్కొంటాడు. ఇక ఈ చెత్త స్టోరీ, వరస్ట్ యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ అనవసరమైన సన్నివేశాలు కారణంగానే సినిమా ఫెయిల్ అయిందని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.