ఈ సినిమాకు దేవర టైటిల్ పెట్టడానికి కారణం అదే.. తారక్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

ఎప్పుడెఎప్పుడా అంటూ టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా వరకు సినీ అభిమానులంతా మోస్ట్ ఎవైటెడ్‌గా ఎదురు చూస్తున్న మూవీ దేవర. ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారీ అంచనాలను నెలకొన్న ఈ సినిమాతో.. దాదాపు ఆరేళ్ల తర్వాత తారక్ సోలోగా వెండి తెరపై మెర‌వ‌నున్నాడు. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అన్ని పనులను పూర్తి చేసుకున్న ఈ మూవీ.. మరికొద్ది రోజుల్లో రిలీజ్ కానుంది. జాన్వి కపూర్ హీరోయిన్గా, బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌ నటిస్తున్న ఈ సినిమాను.. సెప్టెంబర్ 27న గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ భారీ లెవెల్లో జరుగుతున్నాయి.

అలా ఇటీవల జరిగిన ఓ ప్రెస్ మీట్ లో తన సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు ఎన్టీఆర్. సినిమా విడుదల టైం దగ్గరవుతున్న క్రమంలో తనకు టెన్షన్‌గా ఉందని.. అయితే సినిమా కథపై నాకు నమ్మకం ఉందంటూ చెప్పుకొచ్చాడు. టీమ్ అంతా ఎంతో కష్టపడి పని చేసామని వివరించాడు. ఇక ప్రస్తుతం అనిరుధ్ టైం నడుస్తుంది. విజయాన్ని అందుకున్న చాలామంది.. తర్వాత పలు కారణాలతో ఫెయిల్ అవుతారు. కానీ.. ఈ సినిమాకు సంగీతం ఎంత అవసరమా అనిరుధ్‌కు బాగా తెలుసు. అందుకే అనుకున్న రిజల్ట్ వచ్చే వరకు కష్టపడ్డారు. జైలర్, విక్రమ్, మాస్టర్ సినిమాలకు అద్భుతమైన సంగీతం అందించిన అనిరుధ్‌ ప్రస్తుతం ఏఆర్ రెహమాన్ రేంజ్‌లో దూసుకుపోతున్నాడు.

అంతర్జాతీయ సినిమాలకు కూడా కంపోజ్ చేస్తూ రాణిస్తున్నాడు. ఇక మా సినిమా ట్రిపులర్ లాగా దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు చేరుకోవాలనే ఉద్దేశంతోనే సినిమాకు పవర్ ఫుల్ టైటిల్ పెట్టాలనుకున్నం. అందుకే మా సినిమాకు దేవర అనే టైటిల్ను ఫిక్స్ చేసాం. దేవర అంటే దేవుడు అని అర్థం అంటూ వివరించాడు తార‌క్‌. ఇక ఈ సినిమాకు హీరోయిన్గా మొదట జాన్విని అనుకోలేదని.. స్టోరీ రాస్తున్న క్రమంలో హీరోయిన్గా ఎవరైనా తీసుకోవాలని ఆలోచనలు జరుగుతున్నప్పుడు.. జాన్వి మంచి నటి.. తనని తీసుకుంటే బాగుంటుందని ప్రొడ్యూసర్ కారణ్‌ జోహార్ సజెస్ట్ చేశారని.. దాంతో ఆమెను తీసుకున్నాం.. జాన్వి మంచి నటి. ఆమె యాక్టింగ్ చూసి ఆశ్చర్యపోయ్యా అంటూ వివరించారు ఎన్టీఆర్.