టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. దిల్ సినిమాతో ప్రొడ్యూసర్‌గా మారి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న ఈయన.. తన పేరును దిల్ రాజుగా మార్చుకుని ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ ప్రోడ్యుసర్‌గా రాణిస్తున్నారు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలో ఎదురులేని ప్రొడ్యూసర్‌గా మంచి ఇమేజ్‌తో దూసుకుపోతున్నాడు. ఇక దిల్ రాజు నుంచి సినిమా వస్తుందంటే.. ఆ సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉంటాయనడంలో అతిశయోక్తి లేదు. ఆ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధిస్తుందనే ఒక్క కాన్ఫిడెంట్ జనంలో ఉండే రేంజ్‌కు దిల్ రాజు బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు.
ఇదిలా ఉంటే దాదాపు స్టార్ హీరోలు అందరితోను సినిమాలు తెరకెక్కించిన దిల్ రాజు గతంలో ఎన్టీఆర్‌తో తెరకెక్కించాల్సిన ఓ సూపర్ హిట్ సబ్జెక్ట్ మాత్రం మరో యంగ్ హీరోతో తీసి సక్సెస్ అందుకున్నారు. ఇంతకీ ఆ సినిమా ఏంటి.. అసలు వేరే హీరోకు ఆ కథను ఇవ్వడాని వెనుక కారణం ఏంటో ఒకసారి తెలుసుకుందాం.బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్‌లో తెరకెక్కిన బొమ్మరిల్లు మూవీ సూపర్ డూపర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోగా సిద్ధార్థ, హీరోయిన్గా జెనీలియా నటించి మెప్పించారు. ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారాడు సిద్ధార్థ్. దీన్నిబట్టి సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అందుకుందో అర్థమవుతుంది.
అయితే మొదట ఈ సినిమా స్టోరీని దిల్ రాజు ఎన్టీఆర్ కు చెప్పారట. ఎన్టీఆర్ మాత్రం సినిమా సాఫ్ట్ గా ఉందనే ఉద్దేశంతో.. స్క్రిప్ట్ నచ్చిన తన ఇమేజ్‌కు సెట్ కాదని రిజెక్ట్ చేశాడట. దిల్ రాజు చేసేదేమీ లేక తర్వాత ఆ ప్లేస్‌లో సిద్ధార్థ్‌ను పెట్టి సినిమాను తెరకెక్కించారు. ఇక ఈ సినిమా రిలీజై సిద్ధార్థ్‌కి స్టార్ ఇమేజ్‌ను తేవడమే కాదు.. బ్లాక్ బస్టర్ సక్సెస్ అందించింది. దాదాపు ఈ సినిమా హావా మూడు నాలుగు ఏళ్ళు ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉంది. ఎక్కడ చూసిన సినిమాలోని పాటలు మారుమోగుతూనే ఉండేవి. ఇప్పటికీ ఈ సినిమా బుల్లితెరపై వస్తే ఎంతోమంది రెప్పకొట్టకుండా చూస్తూ ఉండిపోతారు. అయితే ఈ సినిమాను మొదట ఎన్టీఆర్ తో తీయాలనే దిల్ రాజు గట్టిగా ఫిక్స్ అయ్యారట. కానీ తారక్ చేయనని చెప్పడంతో సిద్ధార్థ ఆ సినిమాలో నటించి సక్సెస్ అందుకున్నాడు. ఇక ఎన్టీఆర్ ఈ సినిమాలో నటించి ఉంటే కేవలం మాస్ సినిమాలే కాదు.. క్లాస్ సినిమాలతో సక్సెస్ అందుకున్న లోటు కూడా అభిమానులకు తీరేది.