ప్రస్తుతం తారక్.. దేవర సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో ఆడియన్స్‌ను పలకరించనున్న సంగతి తెలిసిందే. మోస్ట్ ఎవైటెడ్ మూవీగా ఈ సినిమాను హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా.. కొరటాల శివ రూపొందించారు. జాన్వి కపూర్ హీరోయిన్గా.. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటించిన ఈ సినిమా ఈనెల 27న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఇక రిలీజ్ టైం దగ్గర పడుతున్న క్రమంలో.. మేకర్స్ ప్రమోషన్స్‌లో జోరు పెంచారు. ఇందులో భాగంగా తాజా ప్రమోషన్స్‌లో ఎన్టీఆర్ మాట్లాడుతూ ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. తాజాగా కోలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన తారక్ తను అట్లీతో సినిమా చేయడానికి చర్చలు జరిపినట్లు వివరించారు. త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రావడం ఖాయం అన్నట్లుగా చెప్పుకొచ్చారు.
అట్లీ గొప్ప ట్యాలెంటెడ్ డైరెక్టర్ అని చెప్పిన తారక్.. నాకు ఓ ఇంట్రెస్టింగ్ రొమాంటిక్ కామెడీ స్టోరీ లైన్ వినిపించారని.. దాని గురించి మేమిద్దరం మాట్లాడుకున్నాం. అయితే నేను, అట్లి ఇద్దరం ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండడం వల్ల.. అది సెట్స్‌పైకి రాలేదు. భవిష్యత్తులో అట్లీతో కచ్చితంగా ఆ సినిమా చేస్తానంటూ చెప్పుకొచ్చాడు తారక్. అట్లీ.. రాజా రాణి సినిమాను తెరకెక్కించిన విధానం నాకు ఎంతో నచ్చుతుందంటూ వివరించాడు. ఇదే ఇంటర్వ్యూలో ఎన్టీఆర్.. కోలీవుడ్‌లో మరికొందరు స్టార్ దర్శకుల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
లోకేష్ కనకరాజన్ పనితనం తనకు ఇష్టమని.. విక్రమ్ సినిమా తమిళ్ ఇండస్ట్రీకి గొప్ప పేరు తెచ్చిందని చెప్పుకొచ్చారు. ఇక నెల్సన్ దిలీప్ కుమార్ జైలర్‌లో రజనీకాంత్ ను చూపించిన విధానానికి ప్రసంసలు కురిపించారు. ఇప్పటివరకు రజనీకాంత్ ను అలాంటి పాత్రలో చూడలేదని.. ఇటీవల వచ్చిన రాయిన్లో ధనుష్ నటన తనను ఆకట్టుకుందని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో తారక్ – అట్లీకాంబోలో సినిమా వస్తే బాగుంటుందంటూ అభిమానులు తమ అభిప్రాయాని వ్యక్తం చేస్తున్నారు.