దగ్గుపాటి లక్ష్మీ ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండరనడంలో అతిశయోక్తి లేదు. నాగార్జున మొదటి భార్య.. అలాగే ది గ్రేట్ లెజెండ్రీ నిర్మాత దగ్గుపాటి రామానాయుడు కూతురుగా.. వెంకటేష్, సురేష్ బాబుల సోదరిగా దాదాపు టాలీవుడ్ ప్రేక్షకులందరికీ దగ్గుబాటి లక్ష్మీ తెలుసు. ఇక నాగార్జున తో వివాహం తర్వాత.. నాగచైతన్యకు తల్లిగా మారిన దగ్గుపాటి లక్ష్మి అతనితో విడాకుల తర్వాత మరో వ్యక్తిని వివాహం చేసుకుని అమెరికాలో సెట్టిల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇంతకీ దగ్గుబాటి లక్ష్మీ పెళ్లి చేస్తుకుంది ఎవరిని.. ఆమె రెండో పెళ్లి చేసుకోవడంతో నాగచైతన్యకు అసలు ఇష్టం లేకా ఏవ చేశారో తెలుసా.. అంటూ ఓ వార్త వైరల్ అవుతుంది. అది ఏంటో ఒకసారి చూద్దాం. కింగ్ నాగార్జున, లక్ష్మీలది ప్రేమ పెళ్లి కాదు. కేవలం పెద్దలు కుదిర్చిన వివాహం. అందుకే వీరి వివాహం ఎక్కువ రోజులు నిలబడలేదేమో.
అయితే ప్రేమ వివాహం అయితే ఎక్కువ రోజులు బంధం కొనసాగుతుందని దాని అర్థం కాదు.. పెద్దలకు వదిలేసిన వివాహం కనుక అటు ఏడు తరాలు, ఈటు ఏడు తరాలు చూసి చేస్తారు. కానీ.. పెళ్లి చేసుకున్న వారి మధ్య అండర్స్టాండింగ్ ఉంటేనే ఆ వ్యక్తి అమెరికా వ్యక్తి అయినా.. పల్లెటూరి వ్యక్తి అయినా.. జీవితాంతం తోడుగా ఉంటారు. అండర్స్టాండింగ్ లేకపోతే.. ఎవరి బంధమైనా మధ్యలోనే ముక్కలు అవ్వక తప్పదు. అయితే ఇదే నాగచైతన్య, లక్ష్మిలా లైఫ్ లో పనిచేసింది. వీరి పెళ్లి నాలుగు సంవత్సరాలు కూడా కాకముందే బ్రేకప్ అయిపోయింది. సేమ్ టు సేమ్ నాగ చైతన్య, సమంత లాగే.. నాగార్జున లక్ష్మీ లకు విడకులు జరిగాయి. అయితే లక్ష్మీ, నాగార్జునకు అప్పటికి నాగచైతన్య జన్మించాడు. విరి విడాకులకు కారణలు ఇవే అంటూ ఎన్నో విషయాలు ఇప్పటికి నెట్టింటి వైరల్ అవుతూనే ఉంటాయి. కొంతమంది నాగర్జున వేరే అమ్మాయితో తిరగడం దగ్గుబాటి లక్ష్మీ విడాకులు ఇవ్వడానికి కారణమని టాక్.
మరి కొంతమంది లక్ష్మీ.. నాగార్జునని సినిమాలు మానేసి తనతో అమెరికా రమ్మని ఒత్తిడి చేసేదని.. కానీ నాగార్జునకు ఇష్టం లేక ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయని.. ఎన్నో వార్తలు వైరల్ అవుతూ ఉంటాయి. అయితే వీరి విడాకులకు అసలు కారణం ఇప్పటివరకు తెలియదు. ఇక నాగార్జున, లక్ష్మీ విడిపోయిన తర్వాత నాగచైతన్య తల్లి దగ్గరే పెరిగిన సంగతి దాదాపు అందరికీ తెలుసు. అప్పుడప్పుడు సెలవులకు నాగార్జున దగ్గరకు వస్తూ ఉండేవాడు. ఇక దగ్గుబాటి లక్ష్మీ విడాకుల తర్వాత శ్రీరామ్ మోటార్స్ అధినేత శరత్ విజయ్ రాఘవన్ ని రెండో వివాహం చేసుకుంది. అయితే రెండో పెళ్లి ఇష్టం లేని నాగచైతన్య తండ్రి దగ్గరకు వచ్చేసాడని.. ఇండస్ట్రీలో టాక్. కానీ.. ఇందులో ఎలాంటి నిజం లేదట. ఎందుకంటే నాగచైతన్య తన తల్లి రెండో వివాహాన్ని ఎప్పుడు తప్పు పట్టలేదట. అలాగే లక్ష్మీ, శరత్ విజయ రాఘవన్ల కొడుకు పెళ్లికి కూడా నాగచైతన్య వెళ్ళాడు. అలాగే రీసెంట్గా శోభిత, నాగచైతన్య ఎంగేజ్మెంట్ కు దగ్గుపాటి లక్ష్మి.. తన రెండో భర్త, తన కొడుకు, కోడలు తో కలిసి వచ్చింది.